Advertisement

  • కోహ్లీతో బాబర్ అజామ్ పోలికపై స్పందించిన అశ్విన్ ..దానికి ఇంకా చాలా సమయం ఉంది

కోహ్లీతో బాబర్ అజామ్ పోలికపై స్పందించిన అశ్విన్ ..దానికి ఇంకా చాలా సమయం ఉంది

By: Sankar Sat, 25 July 2020 1:48 PM

కోహ్లీతో బాబర్ అజామ్ పోలికపై స్పందించిన అశ్విన్ ..దానికి ఇంకా  చాలా సమయం ఉంది



ఇటీవల కాలంలో పాకిస్థాన్ యువ ఆటగాడు బాబర్ అజాంను టీమిండియా స్టార్ క్రికెటర్ , కెప్టెన్ విరాట్ కోహ్లీతో పోలుస్తున్నారు కొందరు పాకిస్థాన్ మాజీ ఆటగాళ్లు ...అయితే ప్రస్తుత క్రికెట్ లో దిగ్గజ ఆటగాడు అయినా కోహ్లీతో ఇపుడే నిలదొక్కుకుంటున్న అజాం ను పోల్చడం కరెక్ట్ కాదని మరికొందరు క్రికెటర్లు అంటున్నారు ..తాజాగా టీమిండియా స్టార్ స్పిన్నర్ రవి అశ్విన్ వీరిద్దరి పోలిక పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసాడు ..

బాబర్ అజామ్‌ని కోహ్లీతో పోల్చడంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రవిచంద్రన్ అశ్విన్ మాట్లాడుతూ ‘‘బాబర్ అజామ్‌ బ్యాటింగ్‌ని నేను బాగా ఎంజాయ్ చేస్తాను. గత ఏడాది చివర్లో ఆస్ట్రేలియా గడ్డపై అతను సాధించిన టెస్టు సెంచరీని చూశా. అయితే.. విరాట్ కోహ్లీతో బాబర్ అజామ్‌ని పోల్చడం సరికాదు. నా అంచనా ప్రకారం కోహ్లీతో పోలిక బాబర్‌పై ఒత్తిడి పెంచే అవకాశం ఉంది. క్రికెట్ ప్రపంచంలో కోహ్లీ ఓ అత్యుత్తమ క్రికెటర్‌గా ఇప్పటికే ఎదిగాడు. అలానే.. బాబర్ అజామ్ కూడా ఆ స్థాయిని అందుకునే అవకాశం ఉంది’’ అని అశ్విన్ జోస్యం చెప్పాడు.

2008లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ ఇప్పటికే 70 సెంచరీలు నమోదు చేసి.. సచిన్ టెండూల్కర్ 100 శతకాలు రికార్డుని బ్రేక్ చేయగల సామర్థ్యం ఉన్న ఏకైక క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. మరోవైపు 2015లో పాక్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చిన బాబర్ అజామ్.. ఇప్పటి వరకూ 16 సెంచరీలు మాత్రమే నమోదు చేశాడు..దీనితో యువ ఆటగాడిని కోహ్లీతో పోల్చి ఒత్తిడి పెంచొద్దు అని కొందరు మాజీలు అంటున్నారు ..

Tags :
|
|
|

Advertisement