Advertisement

  • మురళీధరన్ కు ధోని ఆ రోజు చుక్కలు చూయించాడు...అశ్విన్

మురళీధరన్ కు ధోని ఆ రోజు చుక్కలు చూయించాడు...అశ్విన్

By: Sankar Thu, 18 June 2020 12:17 PM

మురళీధరన్ కు ధోని ఆ రోజు చుక్కలు చూయించాడు...అశ్విన్



మహేంద్ర సింగ్ ధోని ..ఈ పేరు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు ..అయితే ధోని ఇప్పుడు ఆడుతున్న ఆటకు , కెరీర్ ప్రారంభం లో ఆడిన ఆటకు ఏ మాత్రం సంబంధం లేదు ..అప్పట్లో ధోని మాదిరి హిట్టింగ్ చేసే ఆటగాడు ఎవరు లేరు ..తన భారీ సిక్స్ హిట్టింగ్ అబిలిటీతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూయించాడు..అయితే కెప్టెన్ గా మారిన తర్వాత తన ఆటతీరుతో మార్పు వచ్చింది ..

అయితే ధోని కెరీర్ కొత్తలో 2008 ఐపీయల్ ప్రారంభ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ టీం ప్రాక్టీస్ సెషన్లో ధోని , మురళీధరన్ బౌలింగ్ లో ఎలా విరుచుకుపడింది స్పిన్నర్ అశ్విన్ గుర్తుచేసుకున్నాడు..ధోనీ హిట్టింగ్ దెబ్బకి ముత్తయ్ మురళీధరన్ విసిరిన ఓ ఆరు బంతులు చెన్నైలోని చెపాక్ స్టేడియం పైకప్పుని తాకినట్లు ఈ సీనియర్ ఆఫ్ స్పిన్నర్ వెల్లడించాడు. 2008 ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ప్రాక్టీస్ సెషన్‌ గురించి తాజాగా మాట్లాడిన అశ్విన్.. అప్పట్లో శ్రీలంక స్పిన్నర్ ముత్తయ్ మురళీధరన్‌కి ధోనీ చుక్కలు చూపించినట్లు వెల్లడించాడు. ధోనీ సిక్స్ కొట్టిన ప్రతిసారి మురళీధరన్ బాల్ లెంగ్త్‌ని మార్చాడని చెప్పుకొచ్చిన అశ్విన్.. అయినప్పటికీ ప్రయోజనం లేకపోయిందన్నాడు.

dhoni,hit,muralidharan,six,ashwin,chepak , ధోని , మురళీధరన్, అశ్విన్  , ఐపీయల్ , చెపాక్ స్టేడియం


చెపాక్ స్టేడియంలో జరిగిన ప్రాక్టీస్ సెషన్‌లో మహేంద్రసింగ్ ధోనీ, సురేశ్ రైనా బ్యాటింగ్ చేస్తుండగా.. బౌలింగ్ చేసేందుకు చిన్నపాటి క్యూలో బౌలర్లు నిల్చొని ఉన్నారు. మ్యాచ్‌కి వినియోగించే పిచ్ పక్కనే ఆ నెట్ సెషన్‌ని చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంఛైజీ ఏర్పాటు చేసింది. సెంటర్‌లో ధోనీ బ్యాటింగ్ చేస్తుండగా.. అతనికి మురళీధరన్ బౌలింగ్ చేస్తూ కనిపించాడు. కానీ.. ప్రతి బంతికీ ధోనీ భారీ షాట్ ఆడేస్తూ.. స్టాండ్స్‌లోకి తరలించడాన్ని నేను చూశా. ఆరోజే ఓ ఆరు బంతులు స్టేడియం పైకప్పుని తాకినట్లు గుర్తు. ఇప్పుడంటే ధోనీ కాస్త ఆచితూచి బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ.. అప్పట్లో ధోనీలా ఎవరూ హిట్టింగ్ చేయడాన్ని నేను చూడలేదు’’ అని అశ్విన్ వెల్లడించాడు.

Tags :
|
|
|
|

Advertisement