Advertisement

  • అమెరికా వీసా కుంభకోణంలో భారత్కి చెందిన అశిస్ సాహ్నీ అరెస్ట్

అమెరికా వీసా కుంభకోణంలో భారత్కి చెందిన అశిస్ సాహ్నీ అరెస్ట్

By: chandrasekar Sat, 22 Aug 2020 8:58 PM

అమెరికా వీసా కుంభకోణంలో భారత్కి చెందిన అశిస్ సాహ్నీ అరెస్ట్


ప్రస్తుతం హెచ్‌1బీ వీసా అమలులో ట్రంప్ ప్రభుత్వం పలు కొత్త నిబంధనలు తెస్తున్న ఈ సమయంలో తప్పుడు వివరాలతో భారత్ కు చెందిన వ్యక్తి అరెస్ట్ చేయబడ్డాడు. అమెరికాలో ఉద్యోగం చేసుకునేందుకు వీలుగా విదేశీయులకు కల్పించే హెచ్‌ 1బీ వీసాల విషయంలో ఓ భారతీయుడు కుంభకోణానికి పాల్పడ్డాడు. ఇందులో అతడు దాదాపుగా 21 మిలియన్ డాలర్లను ఆర్జించినట్లు దర్యాప్తులో తెలిసింది. దీంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

కొత్తగా తెస్తున్న వీసా చట్టాలవల్ల విదేశీయులు అమెరికాలోనికి వలస వెళ్లడం తగ్గించబడుతుంది. వివరాలు పరిశీలించినట్లైతే భారత్‌కి చెందిన అశిస్ సాహ్నీ(48) అనే వ్యక్తి హెచ్‌ 1 స్పెషాలిటీ ఆక్యుపేషన్ వర్క్ వీసాల్లో మోసాలకు తెరలేపాడు. 2011-16 మధ్యకాలంలో ఇతడు దాదాపుగా 21మిలియన్‌ డాలర్లను ఆర్జించాడు. అంతేకాదు తప్పుడు స్టేట్‌మెంట్‌లతో కూడిన దరఖాస్తులు సమర్పించి, శాశ్వతంగా అమెరికా పౌరుడిగా ఉండేందుకు ప్రయత్నించారని పోలీసులు ఆరోపిస్తున్నారు.

అమెరికా ఉద్యోగాలలో అధిక జీతాలు సంపాదించడం వల్ల ఆ దేశ పౌరసత్వం కోసం అనేక మార్గాలను ఇతర దేశస్థులు వెతుకుంటున్నారు. ఇక అధికారుల దర్యాప్తులో అతడి మోసాలు భయటకు రావడంతో అరెస్ట్ చేసి పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఒకవేశ అశిస్‌ నేరం రుజువైతే అతడికి 10 సంవత్సరాల పాటు జైలు శిక్ష పడుతుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అనవసరంగా మోసాలకు పాటుబడి శిక్షకు గురవుతున్నారు.

Tags :
|

Advertisement