Advertisement

  • అదృష్టం అంటే ఏంటో సచిన్ కు ఆ మ్యాచ్ లో తెలిసింది ..ఆశిష్ నెహ్రా

అదృష్టం అంటే ఏంటో సచిన్ కు ఆ మ్యాచ్ లో తెలిసింది ..ఆశిష్ నెహ్రా

By: Sankar Tue, 11 Aug 2020 1:34 PM

అదృష్టం అంటే ఏంటో సచిన్ కు ఆ మ్యాచ్ లో తెలిసింది ..ఆశిష్ నెహ్రా



ఇండియా పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉత్కంఠ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ..ఇక అందులోనూ అది వరల్డ్ కప్ సెమి ఫైనల్ మ్యాచ్ అయితే రెండు దేశాల ప్రధానుల నుంచి సామాన్యుల దాకా ఆ మ్యాచ్ మీదనే ఉంటారు ..

2011 ప్రపంచ కప్ లో అంతటి ఉత్కంఠ భరిత మ్యాచ్ లో క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ అద్భుతంగా రాణించి టీమిండియాకు ఘన విజయాన్ని అందించి ప్రపంచ కప్ ఫైనల్ కు చేర్చాడు. ఆ మ్యాచ్‌లో సచిన్‌ 85 పరుగులతో కీలక ఇన్నింగ్స్‌ ఆడినా.. నాలుగుసార్లు ఔటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. తాజాగా ఆనాటి మ్యాచ్‌ విషయాలను నెహ్రా మరోసారి పంచుకున్నాడు.

నిజంగా ఆరోజు పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సచిన్‌ నక్కతోక తొక్కివచ్చాడనే చెప్పాలి. ఎందుకంటే అతను చేసిన 85 పరుగులు.. నాలుగు సార్లు పాక్‌ ఫీల్డర్లు క్యాచ్‌లు విడవడం ద్వారా సాధించాడు. అదృష్టం అంటే ఎలా ఉంటుందో బహుశా సచిన్‌కు ఆరోజు తెలిసి ఉంటుంది. సచిన్‌కు నెర్వెస్‌ నైంటీస్‌ అనే ఫోబియా ఉండేది.. కానీ పాక్‌తో జరిగిన సెమీ ఫైనల్లో ఆ ఫోబియా కనిపించలేదు.. కానీ ఒత్తిడి కనిపించింది.

సచిన్‌ నాలుగుసార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడంటే ఆరోజు అదృష్టం అతని వెంట ఉంది. ఇక ప్రపంచకప్‌లో ఒక కీలక మ్యాచ్‌లో ఒత్తిడి ఉండడం సహజం.. అది ఇండియా-పాక్‌, ఇండియా- ఇంగ్లండ్‌ ఏ మ్యాచ్‌ అయినా కావొచ్చు.. మేం సెమీఫైనల్‌ చేరుకొని ఫైనల్‌కు చేరుకునే క్రమంలో ఒత్తిడిని అధిగమించాం 'అంటూ ఆశిష్‌‌ నెహ్రా చెప్పుకొచ్చాడు

Tags :
|

Advertisement