Advertisement

  • నాగశౌర్య చిత్రంలో నందమూరి బాల‌కృష్ణ ఒప్పుకున్నట్లా?

నాగశౌర్య చిత్రంలో నందమూరి బాల‌కృష్ణ ఒప్పుకున్నట్లా?

By: chandrasekar Sat, 21 Nov 2020 10:53 AM

నాగశౌర్య చిత్రంలో నందమూరి బాల‌కృష్ణ ఒప్పుకున్నట్లా?


నాగశౌర్య నటించే చిత్రంలో నందమూరి బాల‌కృష్ణ కీ రోల్ లో నటించేందుకు ఒప్పుకున్నట్లా లేక ఒప్పుకోలేదా అని తెలియాల్సివుంది. ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తూ బిజీగా ఉన్నాడు టాలీవుడ్‌ యువ న‌టుడు నాగ‌శౌర్య‌. టాలీవుడ్ యాక్టర్ నంద‌మూరి బాల‌కృష్ణ‌తో ఆదిత్య 369 వంటి బ్లాక్ బస్ట‌ర్ సినిమాను అందించిన శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ ప్రస్తుతం నాగశౌర్య‌తో సినిమా తీస్తున్నాడు. అయితే శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ తో ఉన్న సాన్నిహిత్యం వ‌ల్ల నాగశౌర్య చిత్రంలో బాల‌కృష్ణ ప‌వ‌ర్ ఫుల్ రోల్ లో న‌టించేందుకు ఒప్పుకున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

దీంతో నాగ‌శౌర్య మూవీలో కీ రోల్ లో క‌నిపిస్తాడ‌ని వార్త‌లు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. అయితే ఇప్ప‌టివ‌ర‌కు ఈ ప్రాజెక్టుకు సంబంధించి బాల‌కృష్ణ ఎలాంటి హామీనివ్వ‌లేద‌ట‌. మ‌రి ఇంత‌కీ యువ న‌టుడి చిత్రంలో సీనియ‌ర్ యాక్ట‌ర్ క‌నిపిస్తాడో? లేదా అన్న‌ది వేచి చూడాలి. ప్ర‌స్తుతం బాల‌కృష్ణ బోయ‌పాటి శ్రీను కాంబోలో తెర‌కెక్కుతున్న బీబీ3 (వ‌ర్కింగ్ టైటిల్‌)లో న‌టిస్తున్నాడు. ప్రస్తుతం సడలింపులు వల్ల షూటింగ్ ప్రారంభమై చాలా సినిమాలు ముందుకి సాగుతుంది.

Tags :
|

Advertisement