Advertisement

  • కరోనా గురించి ఆందోళన వద్దు ..కేసుల పెరుగుదలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు

కరోనా గురించి ఆందోళన వద్దు ..కేసుల పెరుగుదలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు

By: Sankar Fri, 26 June 2020 3:52 PM

కరోనా గురించి ఆందోళన వద్దు ..కేసుల పెరుగుదలపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వ్యాఖ్యలు


దేశంలో కరోనా కేసుల్లో మొన్నటి వరకు అగ్రస్థానంలో ఉన్న ముంబై ను మించి ఢిల్లీ కొత్తగా మొదటి స్థానానికి చేరుకుంది ..రోజు వారి కేసుల్లో కూడా ఢిల్లీ దూసుకుపోతుంది దీనితో మీడియాతో మాట్లాడిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో కరోనా కేసులు పెరుగుతున్నంత మాత్రాన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని పేర్కొన్నాడు ..తక్కువ లక్షణాలతో కూడిన కరోనా కేసులే ఎక్కువ వస్తున్నాయని టెస్టింగ్ సామర్ధ్యాన్ని మూడు రేట్లు పెంచడం కూడా కరోనా కేసుల పెరుగుదలకు కారణం అని అన్నాడు ..

కరోనా రోగుల్లో ఇప్పటికే 45,000 మంది కోలుకున్నారని చెప్పారు. గత వారంరోజులుగా ఢిల్లీలో స్వల్ప లక్షణాలతో కూడిన కరోనా కేసులు పెరుగుతున్నాయని, కేవలం 6000 కోవిడ్‌ బెడ్‌లనే వాడుతున్నామని, ఇంకా 13,500 బెడ్లు ఖాళీగా ఉన్నాయని కేజ్రీవాల్‌ చెప్పుకొచ్చారు.

అయితే కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో దేశ రాజధానిలో బెడ్‌ల సంఖ్యను పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని కేజ్రీవాల్‌ తెలిపారు. ఢిల్లీలో మరింతగా ప్లాస్మా థెరఫీ చికిత్స చేసేందుకు అనుమతి లభించిందని సీరియస్‌ కేసుల్లో ప్లాస్మా థెరఫీ మంచి ఫలితాలను ఇస్తోందని, ఇది మరణాల రేటును తగ్గిస్తుందని కేజ్రీవాల్‌ పేర్కొన్నారు.

Tags :
|
|

Advertisement