Advertisement

  • ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలి ..అరవింద్ కేజ్రీవాల్ విన్నపం

ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలి ..అరవింద్ కేజ్రీవాల్ విన్నపం

By: Sankar Thu, 02 July 2020 5:53 PM

ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలి ..అరవింద్ కేజ్రీవాల్ విన్నపం



కరోనా మహమ్మారి దేశం మొత్తాన్ని అతలాకుతలం చేస్తుంది ..మరోవైపు వాక్సిన్ కూడా లేకపోవడం మరింత ఆందోళన రేకెత్తిస్తుంది ..ఢిల్లీ , ముంబై నగరాలలో కరోనా తీవ్ర దశలో ఉంది ..అయితే ప్రస్తుతం కారొనను తగ్గించడానికి ఉన్న ఒకే ఒక్క మార్గం ప్లాస్మా థెరపీ ..కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయడం వలన దానిని కరొనతో బాధపడుతున్న వారి ట్రీట్మెంట్ లో ఉపయోగించడానికి వీలువుతుంది ..

దీనితో ఢిల్లీలో తొలి ప్లాస్మా బ్యాంక్‌ను ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రారంభించారు. కరోనా నుంచి కోలుకున్న వారు ముందుకు వచ్చి ప్లాస్మాను దానం చేయాల్సిందిగా కేజ్రీవాల్‌ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు, కరోనా వైరస్ చికిత్స కోసం ప్లాస్మా పొందడంలో ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వారికి ఇప్పుడు కొంత ఉపశమనం లభిస్తుందని నేను నమ్ముతున్నాను. ప్లాస్మాను దానం చేయడానికి ఇప్పుడు ఎక్కువ మంది ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను’ అన్నారు. ఐఎల్‌బీఎస్‌ ఆస్పత్రిలో ఈ ప్లాస్మా బ్యాంక్‌ను ప్రారంభించినట్లు ఆప్‌ ట్వీట్‌ చేసింది. ప్లాస్మా దాతకు ఉండాల్సిన లక్షణాలు గురించి కూడా కేజ్రీవాల్‌ వెల్లడించారు..

ఒక వ్యక్తి కరోనావైరస్ నుంచి పూర్తిగా కోలుకొని, 14 రోజుల పాటు ఏ లక్షణాలు లేకుండా ఉంటే ప్లాస్మాను దానం చేయవచ్చని కేజ్రీవాల్‌ తెలిపారు. 18-60 ఏళ్లలోపు ఉండి.. 50కిలోల కంటే ఎక్కువ బరువున్న వారు ప్లాస్మాను దానం చేయవచ్చన్నారు. డయాబెటిస్, ఇన్సులిన్ ఉన్నవారు, క్యాన్సర్‌తో పోరాడుతున్న వారు, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్న వారు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న వారు, గర్భవతులు ప్లాస్మా దానం చేయడానికి అనర్హులు అన్నారు.. ప్లాస్మా దానం చేయడానికి ఇష్టపడే వారు 1031కు కాల్ చేయడం లేదా 8800007722 నంబరుకు వాట్సాప్‌ చేయడం ద్వారా నమోదు చేసుకోవాలని కోరారు. రక్త దానం చేయడం వల్ల బలహీనం కావచ్చు కానీ ప్లాస్మా దానం వల్ల అలా జరగదని తెలిపారు.

Tags :
|
|

Advertisement