Advertisement

  • కరోనా పోరాటంలో మరణించిన డాక్టర్ ..కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చిన కేజ్రీవాల్

కరోనా పోరాటంలో మరణించిన డాక్టర్ ..కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చిన కేజ్రీవాల్

By: Sankar Fri, 03 July 2020 4:57 PM

కరోనా పోరాటంలో మరణించిన డాక్టర్ ..కుటుంబానికి కోటి రూపాయలు ఇచ్చిన కేజ్రీవాల్



కరోనా మహమ్మారి విజృంభణ వలన ప్రజలు ఒకరితో ఇంకొకరు కలవాలంటే భయం వణికిపోతున్నారు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా సౌకుతుందేమో అన్న భయంతో జంకుతున్నారు కానీ డాక్టర్లు మాత్రం అహర్నిశలు కరోనా వచ్చిన వారి దగ్గర ఉంటూ వారికి వైద్యం చేస్తూ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడుతున్నారు ..ఈ పోరాటంలో కొంతమంది డాక్టర్లు కరోనా బారిన పడి ప్రాణాలను వదులుతున్నారు ..

ఇలా కోవిడ్-19తో పోరాడుతూ ప్రాణాలు కోల్పోయిన డాక్టర్ అసీం గుప్తా కుటుంబానికి రూ.1 కోటి నష్ట పరిహారం చెక్కును ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం అందజేశారు. ఎల్ఎన్‌జేపీ హాస్పిటల్‌లో కన్సల్టెంట్ అనస్థీషియాలజిస్ట్‌గా డాక్టర్ అసీం పని చేసేవారు. ఆయన సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు.

ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రి విడుదల చేసిన ఓ ప్రకటనలో డాక్టర్ గుప్తా ప్రముఖ అనస్థీషియా నిపుణుడని తెలిపింది. ఆయన విధి నిర్వహణలో ఉండగా కోవిడ్-19 సోకినట్లు పేర్కొంది. జూన్ 6న ఆయనకు కోవిడ్-19 పాజిటివ్ అని నిర్థరణ అయిందని తెలిపింది. ఆయనను క్వారంటైన్‌కు తరలించారని, వ్యాధి లక్షణాలు తీవ్రమవడంతో జూన్ 7న తమ ఆసుపత్రిలోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో చికిత్స చేసినట్లు తెలిపింది. డాక్టర్ గుప్తా కోరిక మేరకు ఆయనను సాకేత్‌లోని మ్యాక్స్ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపింది. వ్యాధితో పోరాడుతూ, ఆయన ఆదివారం ప్రాణాలు కోల్పోయారని వివరించింది.

Tags :
|

Advertisement