Advertisement

  • ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా ..

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా ..

By: Sankar Sat, 25 July 2020 12:14 PM

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ నిరుద్యోగులకు టోకరా ..



ప్రైవేట్‌ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసం చేసినందుకు గాను గజియాబాద్‌లో శనివారం ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. గజియాబాద్‌ సీనియర్ పోలీస్ సూపరింటెండెంట్ కలానిధి నైతాని మాట్లాడుతూ ఈ ముఠా నకిలీ ఉద్యోగ వెబ్‌సైట్‌ను నడుపుతూ ప్రవేశ రుసుము, రిజిస్ట్రేషన్, నో-ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ల పేరిట మోసపూరిత కార్యకలాపాలకు పాల్పడుతూ నిరుద్యోగులను మోసం చేసి డబ్బు వసూలు చేస్తున్నారన్నారు.

వీరు ఇతర వెబ్‌సైట్ల నుంచి ఉద్యోగార్ధుల వ్యక్తిగత డేటాను చోరీ చేయడం, వారి బ్యాంకు ఖాతాల నుంచి డబ్బు డ్రా చేయడం వంటి సైబర్‌ నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు. రాయి చౌహాన్, ప్రమోద్ సాగర్, వికాస్ అనే ముగ్గురు నిందితులను నోయిడా వాసులుగా గుర్తించినట్లు ఎస్‌ఎస్‌పీ తెలిపారు

ఉద్యోగార్ధుల వ్యక్తిగత డేటా చోరీ చేసి ఇప్పటి వరకు రూ.కోటికి పైగా డబ్బు సంపాదించినట్లు నిందితుడు చౌహాన్ అంగీకరించాడు. ఈ ముఠాలోని మరో సభ్యుడు అజిత్ పాస్వాన్ పరారీలో ఉన్నాడు. ఈ ముఠా ఇప్పటివరకు ఉత్తర ప్రదేశ్, పంజాబ్, రాజస్థాన్, ఢిల్లీ, హర్యానా, గుజరాత్‌లో ఉద్యోగార్ధులను మోసం చేసింది. ఈ రాకెట్‌పై దర్యాప్తులో వారు నిర్వహిస్తున్న నకిలీ కాల్ సెంటర్‌ను కనుగొన్నట్లు పోలీసులు తెలిపారు..

Tags :
|
|
|
|

Advertisement