Advertisement

  • సుఖోయ్, మిగ్ -29 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు

సుఖోయ్, మిగ్ -29 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు

By: chandrasekar Sat, 20 June 2020 10:42 AM

సుఖోయ్, మిగ్ -29 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు కేంద్రం ఏర్పాట్లు


చైనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.5 వేల కోట్లతో సుఖోయ్, మిగ్ -29 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తోంది.దాదాపు వారం పది రోజుల్లోనే మొత్తం వ్యవహారాన్ని పూర్తి చేయాలని ఆఫీసర్లు భావిస్తున్నారు. వీటితోపాటు మన దగ్గర ఉన్న ఫైటర్ ఫ్లైట్స్ కు కావాల్సిన ఎక్విప్ మెంట్ ను కూడా కొనేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

గల్వాన్ లోయలో జరిగిన గొడవలో 20 మంది మన సైనికులు చనిపోవడంతో కేంద్రం అలర్ట్ అయ్యింది. రానున్న రోజుల్లో ఎలాంటి పరిస్థితి ఎదురైనా సిద్ధంగా ఉండేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. చైనా వ్యవహారంలో కఠినంగానే ఉండాలని భావిస్తోంది. ఇప్పటికే నేవీ, ఎయిర్​ఫోర్స్, ఆర్మీలను కూడా అప్రమత్తం చేశారు.

నాలుగేళ్ల క్రితమే ఫ్రాన్స్ నుంచి 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు మనదేశం ఒప్పందం చేసుకుంది. అయితే అవి రావటానికి ఆలస్యమయ్యే అవకాశం ఉండటంతో సుఖోయ్, మిగ్ -29 విమానాలను కొనాలని తాజాగా నిర్ణయం తీసుకుంది. రాఫెల్ ఒప్పందం తర్వాత ఇదే పెద్ద డీల్.

‘చైనా ట్రూప్స్​తో సోమవారం రాత్రి జరిగిన గొడవలో ఇండియన్ సోల్జర్స్ మిస్సింగ్’ అంటూ వస్తున్న రిపోర్టులను ఆర్మీ వర్గాలు కొట్టిపారేశాయి. కొందరు సోల్జర్లు చైనా ఆర్మీ దగ్గర బందీలుగా ఉన్నారని, కొందరు కనిపించడం లేదని వార్తలు వస్తుండటంతో ఈ మేరకు వివరణ ఇచ్చాయి. ఒక్క సైనికుడు కూడా మిస్ కాలేదని స్పష్టం చేశాయి.

arranging,centeral,government,buy,sukhoi and mig 29s ,సుఖోయ్, మిగ్ -29 యుద్ధ విమానాలను, కొనుగోలు ,చేసేందుకు కేంద్రం, ఏర్పాట్లు


గొడవ జరిగిన సమయంలో అక్కడ ఉన్న సోల్జర్లు అంతా వెనక్కి వచ్చారని చెప్పాయి. ప్రస్తుతం కొందరు సైనికులు లడఖ్​లోని ఓ ఆస్పత్రిలో ట్రీట్​మెంట్ తీసుకుంటున్నారు. అయితే మొత్తంగా ఎంతమంది గాయపడ్డారనే విషయం వెల్లడించలేదు.

‘‘గల్వాన్ లోయలో జరిగిన గొడవపై న్యాయమైన పద్ధతిలో ముందుకు వెళ్లాలని చైనా, ఇండియా నిర్ణయించాయి. ఉద్రిక్తతలను తగ్గించేందుకు డిప్లమాటిక్, మిలటరీ మార్గాల ద్వారా కమ్యూనికేషన్, కో ఆర్డినేషన్ చేసుకుంటున్నాయి” అని చైనా ఫారిన్ మినిస్ర్టీ ప్రతినిధి జావో లిజియన్ తెలిపారు.

‘‘కమాండర్ స్థాయి చర్చల్లో వచ్చిన ఏకాభిప్రాయాన్ని సంయుక్తంగా గమనిస్తున్నాం. వీలైనంత త్వరగా ఉద్రిక్తతలను తగ్గించడానికి, శాంతిని నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నాం” అని వివరించారు. ప్రస్తుతం గల్వాన్ లోయలో పరిస్థితి స్టేబుల్​గా, కంట్రోల్​లో ఉందని చెప్పారు.

తూర్పు లడఖ్​లోని గల్వాన్ లోయలో రెండు దేశాలకు చెందిన అధికారులు మరోసారి చర్చలు జరిపారు. తొలి రెండు రౌండ్ల చర్చలు అసంపూర్తిగా ముగియడంతో గురువారం మూడో విడత చర్చలు జరిగాయి. చైనా, ఇండియా సైనికులు గొడవ పడిన ప్రాంతంలో మన మేజర్ జనరల్, చైనీస్ మిలటరీ అధికారులతో చర్చించారు.

arranging,centeral,government,buy,sukhoi and mig 29s ,సుఖోయ్, మిగ్ -29 యుద్ధ విమానాలను, కొనుగోలు ,చేసేందుకు కేంద్రం, ఏర్పాట్లు


సుమారు 6 గంటలపాటు చర్చలు కొనసాగాయి. బలగాలను విత్ డ్రా చేసుకోవడం, సాధారణ పరిస్థితిని తీసుకురావడంపై చర్చలు జరిగాయి. మీటింగ్​కు సంబంధించిన వివరాలేమీ బయటికి రాలేదు. చైన్ ట్రూప్స్ అక్కడి నుంచి వెళ్లేందుకు సంబంధించి ప్రస్తుతానికి ఎలాంటి సంతకాలు జరగలేదని అధికార వర్గాలు వెల్లడించాయి.

గల్వాన్ లోయలో జరిగిన గొడవలో మన సైనికుల దగ్గర ఆయుధాలు ఉన్నాయని విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్ తెలిపారు. లాంగ్ స్టాండింగ్ ప్రాక్టీస్​లో భాగంగా సోల్జర్స్ ఆయుధాలు ఉపయోగించరని వివరించారు. ‘‘సరిహద్దు విధుల్లో ఉన్న జవాన్ల దగ్గర ఆయుధాలు ఉంటాయి. ముఖ్యంగా పోస్ట్‌‌ల నుంచి బయటికి వెళ్లినప్పుడు వారి దగ్గర కచ్చితంగా ఉంటాయి. జూన్ 15న కూడా సైనికులు ఆయుధాలు తీసుకెళ్లారు. లాంగ్ స్టాండింగ్ ప్రాక్టీస్‌‌ (1996, 2005లో చేసుకున్న అగ్రిమెంట్ల ప్రకారం )లో భాగంగా ఫైర్ ఆర్మ్స్ ఉపయోగించరు” అని జైశంకర్ ట్వీట్ చేశారు. ఆయుధాల్లేని 20 మంది సైనికులను రంగంలోకి దింపారని, అందువల్లే వారు చనిపోయారని, దీనికి బాధ్యులెవరని రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్​పై జైశంకర్ ఈ మేరకు వివరణ ఇచ్చారు.

Tags :
|

Advertisement