Advertisement

తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి ఏర్పాట్లు

By: Sankar Wed, 20 May 2020 4:15 PM

తిరుమల వేంకటేశ్వరుని దర్శనానికి ఏర్పాట్లు


భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లు ఏర్పాట్లు. లాక్‌డౌన్‌లో మరిన్ని సడలింపులు. ఆలయాల్లో భక్తులకు స్వామి దర్శనంపై కేంద్రం కీలక ప్రకటన అవకాశం అనుమతి లభిస్తే తీసుకోవాల్సి జాగ్రత్తలపై ప్రభుత్వం కసరత్తు మరియు తిరుమలలో ఏర్పాట్లు ముమ్మరం.

కేంద్రం ప్రకటించనున్న నాలుగవ దశ లాక్‌డౌన్‌లో మరన్ని సడలింపులు ప్రకటించే అవకాశం ఉండవచ్చని భావిస్తున్నారు. తిరుమలలో ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయాలలో భక్తులను దర్శనానికి అనుమతించే అంశంపై కేంద్రం ఓ కీలక ప్రకటన చేసే అవకాశం ఉంటుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆలయంలోకి భక్తులను దర్శనానికి అనుమతిస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తోంది.

venkateswara swamy,tirumala,starts,arrangements,temple ,వేంకటేశ్వరుని, దర్శనానికి, తిరుమల, క్యూలైన్లు, ఆలయాల్లో


శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించినట్లు అయితే తప్పక భౌతిక దూరం పాటించాల్సి ఉండడంతో టీటీడీ అందుకుతగ్గట్లు క్యూ లైన్‌లు ఏర్పాటు చేస్తోంది. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధలకనుగుణంగా తిరుమలతో పాటు టీటీడీ అనుబంధ ఆలయాల్లో ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

దాదాపు కిలోమీటర్‌ దూరంలో ఉండే ఈ క్యూలైన్‌లో మూడు నుంచి నాలుగు అడుగులు దూరం ఉండేలా మార్కింగ్‌ను చేస్తున్నారు. కేంద్రం ఆదేశాల మేరకు శ్రీవారి దర్శనానికి భక్తులను అనుమతించినా, గతంలో లాగా కాకుండా స్వల్ప సంఖ్యలో అనుమతించే అవకాశం ఉండడంతో ఇక పై క్యూ కాంప్లెక్లుల్లోని కంపార్టుమెంట్ల వాడకాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలని టీటీడీ నిర్ణయించింది. ముందుగా భక్తులు శ్రీవారి ప్రసాదం తీసుకునే లడ్డూ కౌంటర్ల మధ్య భౌతిక దూరం పాటించేలా ఈ క్యూలైన్‌లను ఏర్పాటు చేస్తున్నారు.

venkateswara swamy,tirumala,starts,arrangements,temple ,వేంకటేశ్వరుని, దర్శనానికి, తిరుమల, క్యూలైన్లు, ఆలయాల్లో


ఆలయ మహాద్వారం గోపురం నుంచి బంగారు వాకిలి వరకు ఉండే క్యూ లైన్‌లో కూడా ఈ విధంగానే మార్కింగ్‌ చేసేలా చర్యలు చేపట్టినట్లు తెలిసింది. దీంతో క్యూ లైన్‌ మార్కింగ్‌ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రభుత్వం అనుమతించిన వెంటనే దర్శనాలను ప్రారంభించేలా అధికార యంత్రాంగం సమాయత్తమౌతోంది.

Tags :
|

Advertisement