Advertisement

శ్రీవారి దర్శనానికి జూన్‌ 8 నుంచి ఏర్పాట్లు

By: chandrasekar Mon, 01 June 2020 11:56 AM

శ్రీవారి  దర్శనానికి జూన్‌ 8 నుంచి ఏర్పాట్లు


లాక్‌డౌన్‌ 5.0 తర్వాత దర్శనాలపై విధివిధానాలు ప్రకటించింది టీటీడీ. ఈ మేరకు వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌ను టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పరిశీలించారు. ర్శనాలపై అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. జూన్‌ 8వ తేదీ నుంచి భక్తులకు దర్శనానికి అనుమతి ఇచ్చే అవకాశం ఉంది.

రోజుకు 7 వేల మంది భక్తులకు మాత్రమే శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. గంటకు 500 మంది భక్తులకు మాత్రమే ఆలయంలోకి అనుమతించనున్నారు. మొదటి 3 రోజులు టీటీడీ ఉద్యోగులు, సిబ్బందికి అనుమతిచ్చే అవకాశం ఉంది. తర్వాత 15 రోజులు తిరుపతి, తిరుమల వాసులకు అనుమతి ఇవ్వనున్నారు.

arrangements,for srivari darshan,from june,people,god ,శ్రీవారి, దర్శనానికి, జూన్‌, నుంచి ఏర్పాట్లు, టీటీడీ


ప్రయోగాత్మక పరిశీలన తర్వాత చిత్తూరు వాసులకు అనుమతిచ్చే అవకాశం ఉంది. దర్శన టికెట్లను టైంస్లాట్‌ విధానంలో కేటాయించనున్నారు. దర్శన టికెట్లను ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనుంది టీటీడీ. వసతి గదుల కేటాయింపు కూడా ఆన్‌లైన్‌లోనే జరగనుంది.

అలిపిరి వద్ద టోకెన్‌ ఉన్న భక్తులకు మాత్రమే అనుమతి ఇస్తారు. అలిపిరి, నడకమార్గంలో తనిఖీ చేసిన తర్వాతే భక్తులకు కొండ పైకి వెళ్లేందుకు అనుమతిస్తారు. భక్తులు మాస్కులు, గ్లౌజులు ధరించాలని టీటీడీ నిబంధనలు విధించింది.

Tags :
|

Advertisement