Advertisement

  • మర్హమా సంగమ్ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న ఆర్మీ అధికారులు

మర్హమా సంగమ్ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న ఆర్మీ అధికారులు

By: chandrasekar Wed, 30 Sept 2020 7:10 PM

మర్హమా సంగమ్ ప్రాంతంలో సెర్చ్‌ ఆపరేషన్‌ నిర్వహిస్తున్న ఆర్మీ అధికారులు


జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలో ఉగ్రవాదుల కోసం భద్రతా బలగాలు గాలింపులు చేపట్టాయి. మంగళవారం ఉగ్రవాదులు బలగాలపై కాల్పులు జరిపారు. మర్హమా సంగమ్ ప్రాంతంలో ఈ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నట్లు ఆర్మీ అధికారులు పేర్కొన్నారు.

ఇంకా పూర్తి వివరాలు తేలియాల్సి ఉంది. అంతకు ముందు రోజు పూంచ్ జిల్లాలోని మాన్‌కోట్‌ సెక్టార్‌లోని నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్‌ కాల్పుల విరమణ ఒప్పందాన్ని మీరింది.

పాకిస్థాన్ సైనికులు చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపి, మోర్టార్లతో షెల్లింగ్‌ చేశారని రక్షణశాఖ ప్రజాసంబంధాల అధికారి ఒకరు తెలియజేసారు. భారత జవాన్లు ధీటుగా స్పందించడంతో వెనక్కు తగ్గారని తెలిపారు. నాలుగు రోజుల కిందట అనంతనాగ్‌లో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతమార్చాయి.

Tags :

Advertisement