Advertisement

ఆర్మీ మొగుడి అరాచకం

By: Dimple Tue, 25 Aug 2020 09:02 AM

ఆర్మీ మొగుడి అరాచకం

పేదింటికి ఆసరాగా నిలవాల్పి ఆర్మీ ఉద్యోగి... విద్యావంతురాలిని పెళ్లి చేసుకుని నరకం చూపిస్తున్నాడు..
ఆమెది.. పేద కుటుంబం .. ప్రభుత్వ ఉద్యోగి భర్తగా వచ్చి ఇంటిల్లిపాదికి సంతోషం తెచ్చాడు..

తల్లి కాబోతుండగా.. కట్నం కోసం వేధింపులు ప్రారంభించి పుట్టింటిలో వదిలి వెళ్లిపోయాడు..

లాక్‌డౌన్‌ కాలంలో.. మగ బిడ్డ పుట్టి ఆనందం నింపాడు తల్లి జీవితంలో ఆశలు పెంచాడు..
నేడు కట్టుకున్నోడు.. బిడ్డ కావాలి భార్య వద్దంటున్నాడు ఆమె కన్న బిడ్డను వదులుకోలేక మొగుడ్ని ఎదురించే శక్తి లేక పోలీసుస్టేషన్‌ గడపతొక్కింది..

ఆమె ఆవేదన ఆమె మాటల్లోనే..
నా పేరు అశ్విని. మాది పేద కుటుంబం. బాపట్ల మండలం చుండూరుపల్లి గ్రామం. నాన్న ఆటోడ్రైవరు. అమ్మ గృహిణి. నేను బీఎస్పీ వరకు చదువుకున్నా. ఆర్మీలో పని చేస్తున్న పాత పొన్నూరుకు చెందిన కావూరి సాంబశివరావు సంబంధం రావడంతో అందరూ సంతోషించారు.

నీవు అదృష్టవంతురాలివని అందరూ చెప్పారు. నేనూ ఆనందపడ్ఢా ఏడాదన్నర కిందట మా వివాహం ఘనంగా జరిపించారు. అంతా బాగానే జరిగింది. కొద్ది నెలల నుంచి భర్తతోపాటు అత్తా అధిక కట్నం కోసం వేధింపులు ప్రారంభించారు.

మా నాన్న ఆటో నడిపితేనే మా కుటుంబం నడిచేది. వారిని డబ్బుల కోసం ఇబ్బంది పెట్టకూడదని చచ్చిపోదామని.. ఆత్మహత్యయత్నం చేసుకుంటుండగా స్థానికులు అడ్డుకున్నారు.ఆ తర్వాత నేను 3 నెలల గర్భవతిని కావడంతో పుట్టింటికి పంపించారు.
నాకు బాబు పుట్టాడు. ఇప్పుడు నా భర్త నీవు పొట్టిగా ఉన్నావని.. నాకు అవసరం లేదంటున్నాడు. మగబిడ్డ నాకు కావాలని.. వాడిని తీసుకువెళ్తానని బెదిరిస్తున్నాడు. రోజుల పసివాడిని నా నుంచి దూరం చేస్తారేమోనని భయంగా ఉంది.

కరోనా కాలంలో.. 25 రోజుల పసివాడితో ఆటోలో వచ్చి స్పందనలో ఏఎస్పీ మూర్తిని కలిసి తమ ఆవేదనను వివరించింది. ఆయన వెంటనే స్పందించి బాధితురాలి సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

Tags :
|

Advertisement