Advertisement

  • ఇండియా చైనా సంఘర్షణలో గాయపడ్డ సైనికులను పరామర్శించనున్న ఆర్మీ చీఫ్

ఇండియా చైనా సంఘర్షణలో గాయపడ్డ సైనికులను పరామర్శించనున్న ఆర్మీ చీఫ్

By: Sankar Mon, 22 June 2020 6:50 PM

ఇండియా చైనా సంఘర్షణలో గాయపడ్డ సైనికులను పరామర్శించనున్న ఆర్మీ చీఫ్



భారత సైన్యాధ్యక్షుడు ఎంఎం నరవణే లడక్ వెళ్లనున్నారు. గ్రౌండ్ కమాండర్లతో సమావేశమౌతారు. వాస్తవాధీన రేఖ వెంబడి తాజా పరిస్థితులపై సమీక్ష జరుపుతారు. చైనాతో ఉద్రిక్తతల వేళ నరవణే లడక్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. రెండు రోజుల క్రితమే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ చీఫ్ భదౌరియా పర్యటించారు. తమ పర్యటనలో భాగంగా నరవణే లడక్ గల్వాన్ లోయలో చైనా పాశవిక దాడిలో గాయపడిన భారత సైనికులను పరామర్శిస్తారు. వీరంతా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

జూన్ 15న లడక్ గల్వాన్ లోయలో బలగాల ఉపసంహరణ సందర్భంగా చైనా కుట్రపూరితంగా భారత జవాన్లపై దాడికి పాల్పడింది. ఈ ఘటనలో 20 మంది భారత జవాన్లు అమరులయ్యారు. అటు చైనా తరపున కూడా పెద్ద సంఖ్యలో మరణాలు సంభవించినా డ్రాగన్ కంట్రీ ఇప్పటివరకూ స్పష్టమైన ప్రకటన చేయడం లేదు. మరోవైపు గల్వాన్ లోయలో చైనా కుట్రపూరిత దాడి నేపథ్యంలో త్రివిధ దళాలకు కేంద్రం పూర్తి స్వేచ్చనిచ్చింది.

Tags :
|
|

Advertisement