Advertisement

  • సీనియర్ లెఫ్టినెంట్ జనరల్‌ను నియమించిన ఆర్మీచీఫ్

సీనియర్ లెఫ్టినెంట్ జనరల్‌ను నియమించిన ఆర్మీచీఫ్

By: chandrasekar Mon, 21 Sept 2020 5:18 PM

సీనియర్ లెఫ్టినెంట్ జనరల్‌ను నియమించిన ఆర్మీచీఫ్


ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయం పరిధిలోని కమాండర్, సౌత్ వెస్ట్రన్ కమాండ్‌, చీఫ్ ఆఫ్ స్టాఫ్ పాత్ర, విధులు, చేపట్టిన పలు నియామకాలను సీనియర్ లెఫ్టినెంట్ జనరల్ పరిశీలిస్తారు. సౌత్ వెస్ట్రన్ ఆర్మీ కమాండ్‌లో అభిప్రాయ భేదాలను పరిశీలించేందుకు సీనియర్ లెఫ్టినెంట్ జనరల్‌ను ఆర్మీ చీఫ్ ఎంఎం నారవాణే నియమించారు.

జైపూర్‌లో ఉన్న సౌత్ వెస్ట్రన్ ఆర్మీ కమాండ్ ప్రధాన కార్యాలయం రాజస్థాన్ నుంచి పంజాబ్ వరకు పాకిస్థాన్ సరిహద్దులో సైనిక కార్యకలాపాలను నిర్వహిస్తుంది. అయితే ఈ కమాండ్ ప్రధాన కార్యాలయంలో కార్యకలాపాల ఇబ్బందుల వల్ల రోజువారీ విధులకు ఆటంకం కలుగుతున్నదని ఆర్మీ కమాండర్, సౌత్ వెస్ట్రన్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ నుంచి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్‌కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సౌత్ వెస్ట్రన్ కమాండ్ ప్రధాన కార్యాలయం పనితీరు క్రమబద్ధీకరణపై సలహాలు, పరిష్కార చర్యలతో సహా వివరణాత్మక నివేదికను సమర్పించాలని దీని కోసం నియమించిన లెఫ్టినెంట్ జనరల్‌ను ఆర్మీ చీఫ్ నారవాణే ఆదేశించారు.

Tags :
|

Advertisement