Advertisement

  • ఆన్ లైన్ మీటింగ్లో భార్యతో రొమాన్స్ చేసిన శాసన సభ్యుడు

ఆన్ లైన్ మీటింగ్లో భార్యతో రొమాన్స్ చేసిన శాసన సభ్యుడు

By: Sankar Sat, 26 Sept 2020 4:46 PM

ఆన్ లైన్ మీటింగ్లో భార్యతో రొమాన్స్ చేసిన శాసన సభ్యుడు


ఆయనో శాసనసభ్యుడు.. అందరికీ ఆదర్శంగా ఉండాల్సిన వ్యక్తి. కానీ, తోటి శాసనసభ్యులంతా బిల్లుపై ఆన్‌లైన్ సమావేశంలో చర్చ జరుపుతుండగా, తన భార్యతో రొమాన్స్‌ చేశాడు. ఈ ఘటన అతడి రాజీనామకు దారితీసింది.ఈ సంఘటన అర్జెంటీనాలో జరిగింది.

ఆ దేశ దిగువ సభ కాంగ్రెస్ వర్చువల్ సెషన్‌ నడుస్తోంది. శాసనసభ్యులు ఒక బిల్లుపై చర్చిస్తున్నారు. ఇదే సమయంలో అధికార పెరోనిస్ట్ పార్టీకి చెందిన డిప్యూటీ జువాన్ ఎమిలియో అమెరి తన భాగస్వామితో రొమాన్స్‌ చేయడం ప్రారంభించాడు. దీంతో హౌస్ ప్రెసిడెంట్ సెర్గియో మాసా ఆన్‌లైన్ సెషన్‌ను కాసేపు నిలిపేశారు. అమెరిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆదేశించారు. అతడి సస్పెన్షన్ నిర్ణయించడానికి ఒక ప్యానెల్‌ను కూడా ఏర్పాటు చేశారు.

అనంతరం అమెరితో రాజీనామా చేయించి, ఆమోదించారు. ఇదిలా ఉండగా, అమెరి స్థానిక రేడియోతో మాట్లాడుతూ, జరిగిన సంఘటన పట్ల చింతిస్తున్నానని, ఆ సమయంలో తనకు ఇంటర్నెట్‌ కనెక్షన్ లేదని, కానీ ఆటోమేటిక్‌గా ఇంటర్నెట్‌ కనెక్ట్‌ అయ్యిందని చెప్పుకొచ్చాడు.

Tags :
|

Advertisement