Advertisement

  • అర్జెంటీనా ఫుట్‌బాల్‌ వీరుడు డీగో మారడోనా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ వీరుడు డీగో మారడోనా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

By: chandrasekar Fri, 13 Nov 2020 10:47 AM

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ వీరుడు డీగో మారడోనా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్


డియెగో అర్మాండో మారడోనా అక్టోబర్30 1960 న జన్మించారు. అర్జెంటీనా ఫుట్‌బాల్ మేనేజర్ మరియు రిటైర్డ్ ప్రొఫెషనల్ ఫుట్‌బాల్ క్రీడాకారుడు. అతను ప్రస్తుతం అర్జెంటీనా ప్రైమెరా డివిసియన్ క్లబ్ గిమ్నాసియా డి లా ప్లాటాకు కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అతను 20 వ శతాబ్దపు ఫిఫా ప్లేయర్ అవార్డు యొక్క ఇద్దరు ఉమ్మడి విజేతలలో ఒకడు. మారడోనా యొక్క దృష్టి, పాసింగ్, బాల్ కంట్రోల్ మరియు డ్రిబ్లింగ్ నైపుణ్యాలు ప్రత్యర్థి ఆటగాళ్లను పరుగులో పడేస్తాడు. మైదానంలో అతని ఉనికి మరియు నాయకత్వం అతని జట్టు యొక్క సాధారణ పనితీరుపై గొప్ప ప్రభావాన్ని చూపుతాయి.

ప్రపంచంలోనే అందరిచేత కొనియాడబడే ప్రముఖ ఫుట్ బాల్ వీరుడు శస్త్రచికిత్స తరువాత డిశ్చార్జ్ చేయబడ్డాడు. అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. బ్రెయిన్‌ సర్జరీ విజయవంతంకావడంతో బ్యూనస్‌ ఎయిర్స్‌లోని ఆస్పత్రి నుంచి బుధవారం ఆయనను పునరావాస కేంద్రానికి తరలించారు.

గత నెల అక్టోబర్‌ 30తో 60ఏండ్లు పూర్తి చేసుకున్న మారడోనా మెదడులో రక్తం గడ్డకట్టడంతో గతవారం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించారు. ఫుట్‌బాల్‌ లెజెండ్‌ మారడోనా ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ప్రస్తుతం కోలుకుంటున్నారని అతని న్యాయవాది మాటియస్‌ మోర్లా తెలిపారు. తన జీవితంలో మారడోనాకు ఇది కష్టమైన సమయం అని న్యాయవాది అన్నారు. అర్జెంటీనా జట్టుకి మారడోనా 1986లో ఫుట్‌బాల్‌ ప్రపంచకప్‌ అందించారు. గొప్ప క్రీడాకారుడు.

Tags :

Advertisement