Advertisement

  • అబార్షన్లను చట్టబద్దం చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న అర్జెంటీనా

అబార్షన్లను చట్టబద్దం చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న అర్జెంటీనా

By: Sankar Wed, 30 Dec 2020 7:44 PM

అబార్షన్లను చట్టబద్దం చేస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న అర్జెంటీనా


అబార్షన్లను చట్టబద్ధం చేస్తూ అర్జెంటీనా బుధవారం నాడు చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. లాటిన్‌ అమెరికన్‌ దేశాల్లో ఇలాంటి నిర్ణయం తీసుకున్న ప్రధాన దేశం అర్జెంటీనా.

అబార్షన్లను అనుమతించవద్దని, అది శిశువుల జీవించే హక్కును హరించడమేనంటూ క్యాథలిక్‌ చర్చి వ్యతిరేకతను కాదని అర్జెంటీనా సెనేట్‌ 38–29 ఓట్ల తేడాతో అబార్షన్లను అనుమతించే చట్టాన్ని ఆమోదించింది.

బ్యూనస్‌ ఏర్స్‌లో ఉన్న సెనేట్‌ భవనం ముందు నిరీక్షిస్తున్న వేలాది మంది ప్రజలు హర్షద్వానాలతో కొత్త చట్టానికి మద్దతు పలికారు. చట్టాన్ని వ్యతిరేకించిన వారు, బిల్లు ఆమోదం పట్ల కన్నీళ్లు కార్చిన వారు కూడా లేకపోలేదు.

Tags :

Advertisement