Advertisement

  • ఏరియా గ్యాంగ్ స్టర్లు తమకు భయపడాలని భావిస్తారు

ఏరియా గ్యాంగ్ స్టర్లు తమకు భయపడాలని భావిస్తారు

By: chandrasekar Sat, 05 Sept 2020 5:26 PM

ఏరియా గ్యాంగ్ స్టర్లు తమకు భయపడాలని భావిస్తారు


హైద‌రాబాద్‌లోని స‌ర్ధార్ వ‌ల్లభాయ్ ప‌టేల్ నేష‌న‌ల్ పోలీస్ అకాడ‌మీలో దీక్షంత్ ప‌రేడ్ సందర్భంగా శిక్షణ ముగించుకున్న ప్రొబెషనరీ ఐపీఎస్‌ల‌నుద్దేశించి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మోదీ ప్రసంగించారు.

పోలీసు అధికారులు డ్యూటీలో కొత్తగా చేరినప్పుడు ‘సింగం’ సినిమాలోని పోలీస్ లాగా తమని ఊహించుకుంటారని, ప్రతి ఒక్కరు, ముఖ్యంగా ఏరియా గ్యాంగ్‌స్టర్లు తమకు భయపడాలని వారు భావిస్తారని చెప్పారు. దీని వల్ల వారు అసలు పనిని విస్మరించే అవకాశమున్నదని మోదీ అన్నారు. ట్రైనీ ఐపీఎస్ అధికారులు ఈ ధోరణిని వీడాలని ఆయన తెలిపారు. మీ యూనిఫాం వల్ల వచ్చే అధికారానికి గాక, మీ యూనిఫాం పట్ల గర్వపడటం ముఖ్య౦ అని చెప్పారు.

ఖాకీ యూనిఫాంకి ఉన్న గౌరవాన్ని ఎప్పుడూ కోల్పోకూడదని మోదీ సూచించారు. ఒత్తిడితో పనిచేసేవారికి యోగా, ప్రాణాయామం బాగా ఉపయోగపడతాయని చెప్పారు. కరోనా నేపథ్యంలో ఐపీఎస్ పాస్ అవుట్ అధికారులను స్వయంగా కలుసుకోలేకపోతున్నానని, అయితే ఎప్పుడో ఒకప్పుడు కచ్చితంగా మిమ్మల్ని కలుస్తానని తెలిపారు.

Tags :
|
|

Advertisement