Advertisement

  • ఆర్టీసీ ప్రతిష్టంభన వీడినట్లేనా... తెలంగాణ ప్రతిపాదనలను అంగీకరించిన ఏపీ

ఆర్టీసీ ప్రతిష్టంభన వీడినట్లేనా... తెలంగాణ ప్రతిపాదనలను అంగీకరించిన ఏపీ

By: Sankar Fri, 23 Oct 2020 5:34 PM

ఆర్టీసీ ప్రతిష్టంభన వీడినట్లేనా... తెలంగాణ ప్రతిపాదనలను అంగీకరించిన ఏపీ


లాక్‌డౌన్‌ సమయం నాటి నుంచి తెలంగాణ ఆర్టీసీ-ఏపీఎస్‌ ఆర్టీసీ మధ్య ఏర్పడిన ప్రతిష్టంభన వీడినట్లే కనిపిస్తోంది. ఇరు రాష్ట్రల అధికారుల మధ్య ఇప్పటికే పలు విడతలుగా సాగిన భేటీల్లో కీలక అంశాలపై చర్చించగా.. వీటిపై ఏపీఎస్‌ ఆర్టీసీ తుది నిర్ణయం తీసుకుంది.

ఈ మేరకు టీఎస్‌ ఆర్టీసీ అధికారులు కోరిన ప్రతిపాదనలకు తాము సానుకూలంగా ఉన్నామని ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు శుక్రవారం ప్రకటించారు. ఏపీకి పెద్ద ఎత్తున నష్టం జరుగుతున్నా1.6 లక్షల కిమీలకు తగ్గామని పేర్కొన్నారు. ఏపీఎస్‌ ఆర్టీసీ తాజా నిర్ణయంతో ప్రయాణికులకూ ఇబ్బందులు తప్పవన్నారు.

టీఎస్‌ అభ్యంతరాల కారణంగా నష్టం ఉన్నప్పటికీ సర్వీసులను నడపాలనే ఉద్దేశంతో తాము వెనక్కి తగ్గామని కృష్ణబాబు స్పష్టం చేశారు. వాళ్లు కోరినట్లు రూట్‌ వైస్‌ క్లారిటీ కూడా ఇచ్చామని.. ఫైనల్‌ ప్రపోజల్స్‌ కూడా గత వారమే పంపామని తెలిపారు. అయినప్పటికీ టీఎస్‌ ఆర్టీసీ అధికారులు ఇంకా స్పష్టత ఇవ్వడంలేదని, వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు.

కాగా తెలంగాణ పరిధిలో ఏపీ ఆర్టీసీ బస్సులు తిరిగే కి.మీ. 2.64 లక్షలు. తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఏపీ భూభాగంలో తిరిగే కి.మీ. 1.61 లక్షలు మాత్రమే. దీనిపై తెలంగాణ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఏపీ సర్వీసులను తగ్గించుకోవాలని టీఎస్‌ ఆర్టసీ కోరుతోంది. దీనిపైనే గత రెండు నెలలుగా ఇరు రాష్ట్రాల అధికారుల మధ్య చర్చులు సాగుతున్నాయి. తాజా ఏపీ లేఖతో సమస్యను వీడినట్లే తెలుస్తోంది.

Tags :
|

Advertisement