Advertisement

  • మళ్ళీ అదే కథ ..కొలిక్కి రాని ఇరు రాష్ట్ర ఆర్టీసీ అధికారుల చర్చలు

మళ్ళీ అదే కథ ..కొలిక్కి రాని ఇరు రాష్ట్ర ఆర్టీసీ అధికారుల చర్చలు

By: Sankar Tue, 15 Sept 2020 8:43 PM

మళ్ళీ అదే కథ ..కొలిక్కి రాని ఇరు రాష్ట్ర ఆర్టీసీ అధికారుల చర్చలు


తెలుగు రాష్ర్టాల మధ్య అంతర్రాష్ట్ర సర్వీసులు పునర్‌ప్రారంభంపై ఇరురాష్ట్రాల ఆర్టీసీ అధికారులు చర్చలు జరిపారు.. హైదరాబాద్‌ ఎర్రమంజిల్ ఆర్ అండ్ బీ కార్యాలయంలో తెలంగాణ, ఏపీ ఆర్టీసీ ఎండీలు సమావేశమై ఈ వ్యవహారంపై చర్చించారు.. అయితే, ఈ సమావేశం ఇలాంటి నిర్ణయం తీసుకోలేకపోయింది.. మరోసారి తెలుగు రాష్ట్రాల ఆర్టీసీ చర్చలు విఫలం అయ్యాయి. ఇప్పటికే పలుమార్లు చర్చించినా.. మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. ఏపీ, తెలంగాణ మధ్య బస్సులు నడిపే అంశంపై ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఎటుతేల్చకుండానే ఎవరిదారిన వారు వెళ్లిపోయారు.

ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన ఏపీఎస్‌ఆర్టీసీ ఎండీ కృష్ణబాబు.. కోవిడ్ కారణంగా కొన్ని నెలలు బస్సు సర్వీసులు నిలిచిపోయాయి.. మా సూచనలు చెప్పాం.. రాష్ట్ర విభజనకు ముందు 3.43 లక్షల కిలోమీటర్లు ఏపీ రన్ చేసింది.. విభజన తర్వాత 2.65 కిలోమీటర్లకు తగ్గించం. 71 రూట్లలో ఏపీ, 28 రూట్లలో తెలంగాణ బస్సులు తిప్పుతుందన్నారు.

1.1లక్షల కిలోమీటర్లు రెండు రాష్ట్రాల మధ్య గ్యాప్ ఉందని.. మేం 50 వేల కిలోమీటర్లు తగ్గుస్తాం.. మీరు పెంచండి అని తెలంగాణ వాళ్లను కోరామని తెలిపారు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎండీ.. 1.10 వేల కిలోమీటర్ల నుంచి 1.60 వేల కిలోమీటర్లు వరకు పెంచడానికి తెలంగాణ ముందుకు వచ్చిందని వెల్లడించారు. అంతకు మించి పెంచే సామర్ధ్యం మాకు లేదని.. లాభదాయకంగా వుండదని తెలంగాణ చెబుతోందన్నారు.

ఇక, సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన తెలంగాణ ఆర్టీసీ ఇంఛార్జ్ ఎండీ సునీల్‌ శర్మ... రూట్లా వారీగా రెండు రాష్ట్రాలు సమానంగా నడపాలని ప్రపోజ్ చేశాం.. రూట్ల వారీగా క్లారిటీ ఇస్తేనే మేం ముందుకు వెళ్తాం.. రెండు రాష్ట్రాలు అగ్రిమెంట్ ప్రకారం ముందుకు వెళ్తామని.. ఆంధ్రప్రదేశ్‌ ఆర్టీసీ ఏం చెబుతారో దానిని బట్టి ముందుకు వెళ్తామన్నారు సునీల్‌ శర్మ..

Tags :
|
|
|
|

Advertisement