Advertisement

  • హైదరాబాద్లో ఈ ఆసుపత్రులలో ఉచిత కరోనా టెస్టులు ...

హైదరాబాద్లో ఈ ఆసుపత్రులలో ఉచిత కరోనా టెస్టులు ...

By: Sankar Sat, 04 July 2020 8:28 PM

హైదరాబాద్లో ఈ ఆసుపత్రులలో ఉచిత కరోనా టెస్టులు ...

తెలంగాణాలో కరోనా కేసులు తీవ్ర రూపం దాలుస్తున్నాయి ..రోజు రోజుకు కరోనా బాధితుల సంఖ్య పెరుగుతుంది ..రోజుకి వెయ్యి కేసుల నుంచి రెండు వేల కేసుల మధ్య నమోదు అవుతున్నాయి ..అందరూ ప్రైవేట్ హాస్పిటల్లకు వెళ్లి టెస్టులు చేయించుకునే స్థోమత ఉండదు అందుకే తెలంగాణాలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉచితంగా కరోనా టెస్టులు చేస్తున్నారు ..కరోనా పాజిటివ్ అని తేలిన ఎవరైనా గాంధీ హాస్పిటల్‌లో చికిత్స పొందొచ్చని మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ డాక్టర్ కె.రమేశ్ రెడ్డి తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. కరోనా పాజిటివ్ అని తేలిన వారిని మాత్రమే గాంధీలో చేర్చుకుంటామన్నారు. ఎవరికైనా కేవలం శ్వాస సంబంధ సమస్యలు మాత్రమే ఉంటే ఉస్మానియా జనరల్ హాస్పిటల్‌కు వెళ్లాలని ఆయన సూచించారు.

ఒక వేళ ఒకటి కంటే ఎక్కువ కరోనా లక్షణాలు కనిపిస్తే.. కింగ్ కోఠీ హాస్పిటల్‌‌కు వెళ్లాలన్నారు.కరోనా లక్షణాలున్న వారిని కింగ్ కోఠీ హాస్పిటల్‌లో చేర్చుకుంటారని.. అవసరమైతే టెస్టులు చేసి చికిత్స అందిస్తారని డాక్టర్ రమేశ్ రెడ్డి తెలిపారు. ఈ సూచనలు పాటిస్తే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని.. మళ్లీ వెనక్కి వెళ్లాల్సిన అవసరం కూడా ఉండదని ఆయన చెప్పారు.

కాగా 11 ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా టెస్టులను ఉచితంగా చేస్తున్నారు. కోఠిలోని కింగ్ కోఠి హాస్పిటల్, నల్లకుంటలోని ఫీవర్ హాస్పిటల్, ఎర్రగడ్డ చెస్ట్ హాస్పిటల్, అమీర్‌పేట నేచర్ క్యూర్ హాస్పిటల్, మెహదీపట్నం సరోజినీదేవి కంటి ఆసుపత్రి, ఎర్రగడ్డ ఆయుర్వేద ఆసుపత్రి, రామాంతపూర్ హోమియోపతి హాస్పిటల్, చార్మినార్ నిజామియా టీబీ హాస్పిటల్, కొండాపూర్ ఏరియా హాస్పిటల్, వనస్థలిపురంలోని ఏరియా హాస్పిటల్, నాచారం ఈఎస్ఐ హాస్పిటల్‌లో కరోనా లక్షణాలు ఉన్న వారు ఎవరైనా ఉచితంగా టెస్టులు చేయించుకోవచ్చు.

Tags :
|
|

Advertisement