Advertisement

  • తెలంగాణాలో టపాసుల దుకాణాల లైసెన్స్ ఏర్పాటుకు దరఖాస్తు

తెలంగాణాలో టపాసుల దుకాణాల లైసెన్స్ ఏర్పాటుకు దరఖాస్తు

By: chandrasekar Tue, 03 Nov 2020 5:11 PM

తెలంగాణాలో టపాసుల దుకాణాల లైసెన్స్ ఏర్పాటుకు దరఖాస్తు


తెలంగాణాలో టపాసుల దుకాణాల లైసెన్స్ ఏర్పాటుకు దరఖాస్తు చేసుకోడానికి ప్రకటన వెలువడించారు. దీపావళి సందర్భంగా టపాసుల దుకాణాలు ఏర్పాటు చేసేందుకు తాత్కాలిక లైసెన్స్‌ను పొందాలని, అందుకోసం ఈ నెల 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ సూచించారు. లైసెన్స్ లేకుండా దుకాణాలు ఏర్పాటు చేయలేరు.

టపాసుల దుకాణాల లైసెన్స్ పొందుటకు ఆయా జోనల్‌ డీసీపీల ద్వారా తాత్కాలిక లైసెన్స్‌లు జారీ అవుతాయని ఇందుకోసం ఆన్ లైన్ లో https://www.tspolice.gov.in లేదా eservices.tspolice.gov.in వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేయాలని సూచించారు. లైసెన్స్‌ కోసం డివిజనల్‌ ఫైర్‌ అధికారి నుంచి ఎన్‌వోసీ, ప్రభుత్వ స్థలానికి జీహెచ్‌ఎంసీ, ప్రైవేట్‌ స్థలానికి సంబంధిత యజమాని ఎన్‌వోసీ జతచేయాలన్నారు.

గత ఏడాది జారీ చేసిన లైసెన్స్‌ కాపీ, సింగిల్‌ దుకాణానికి చుట్టుపక్కల వారితో ఎన్‌వోసీ, సైట్‌ ప్లాన్‌ బ్లూ ప్రింట్‌ అందించాలని తెలిపారు. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, గన్‌పౌండ్రీ బ్రాంచీలో రూ. 600 లైసెన్స్‌ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. ఇందుకోసం అన్ని జాగ్రత్త చర్యలు చేపట్టాలని సూచించారు.

Tags :

Advertisement