Advertisement

యాపిల్ ప్లాంట్ దాడిలో రూ.440 కోట్ల నష్టం...?

By: chandrasekar Mon, 14 Dec 2020 8:43 PM

యాపిల్ ప్లాంట్ దాడిలో రూ.440 కోట్ల నష్టం...?


బెంగళూరు కోలార్ జిల్లాలోని నర్సాపురలోని ప్లాంట్‌లోని సిబ్బంది తమ జీతాలు చెల్లించలేదనే కోపంతో దాడికి పాల్పడ్డారు. అయితే, ఈ దాడిలో రూ.440కోట్లు ఆస్తి నష్టం జరిగినట్లు ఆ కంపెనీ యాజమాన్యం పేర్కొంది. వేల సంఖ్యలో ఐఫోన్‌లు లూటీ అయినట్లు పేర్కొంది. జరిగిన నష్టాన్ని ఇంకా పూర్తిగా అంచనా వేయాల్సి ఉందని పేర్కొంది. ఈ దాడిలో ఇంచుమించు 5,000 మంది పాల్గొన్నారని కంపెనీ తెలిపింది. ఎస్పీ కార్తీక్ రెడ్డి మాట్లాడుతూ శనివారం ఉదయం 6.30 గంటలకు కొందరు ఉద్యోగులు ఈ దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. వేతనాలకు సంబంధించిన సమస్య కారణంగానే దాడి జరిగినట్లు తెలిసిందని పేర్కొన్నారు. కంప్యూటర్లు, ప్రింటర్లు, ల్యాప్‌టాప్స్, ఫ్లోర్,సీలింగ్స్, ఏసీ తయారీ పూర్తయిన స్మార్ట్‌ఫోన్లు ఇలా దేన్ని వదల్లేదని ఆయన వివరించారు. వారిని అడ్డుకున్న సెక్యూరిటీ గార్డులపై కూడా దాడి చేశారని ఆరోపించారు.

కర్ణాటక ప్రభుత్వం భారత్‌లో ఏర్పాటైన తొలి ఐఫోన్ యూనిట్ విస్ట్రాన్‌పై దాడిని తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై ఎస్పీతో డిప్యూటీ సీఎం అశ్వత్ నారాయణ్ దాడికి పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విస్ట్రాన్ ప్లాంట్‌లో మొత్తం ఆరు కాంట్రాక్ట్ సంస్థల నుంచి 8,900 మందిని నియమించుకుందని, 1,200 మంది శాశ్వత ఉద్యోగులు ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. ఉద్యోగులకు వేతనాలు చెల్లించడంలో ఆ సంస్థ జాప్యం చేసిందని తెలిసిందని, దీనిని పరిశీలిస్తామని పేర్కొన్నారు. మూడు రోజుల్లోగా వేతనాలు చెల్లించాలని కార్మిక శాఖ ఆదేశాలు జారీచేసిందన్నారు.

Tags :
|
|
|

Advertisement