Advertisement

  • యూజర్ల ప్రవర్తన తెలుసుకోవడానికి కొత్త రకం సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న యాపిల్

యూజర్ల ప్రవర్తన తెలుసుకోవడానికి కొత్త రకం సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న యాపిల్

By: chandrasekar Wed, 18 Nov 2020 3:49 PM

యూజర్ల ప్రవర్తన తెలుసుకోవడానికి కొత్త రకం సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్న యాపిల్


విదేశాల్లో టెక్ దిగ్గజం యాపిల్‌పై ఫిర్యాదులు పెరుగుతున్నాయి. ఐఫోన్ యూజర్ల ప్రవర్తనను తెలుసుకోవడానికి ఆ సంస్థ కొత్త రకం సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించడాన్ని యూరోపియన్ ప్రైవసీ హక్కుల కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. ఈ చర్యలను వియన్నా కేంద్రంగా పనిచేసే NOYB అనే సంస్థ ప్రశ్నిస్తోంది. NOYB పూర్తిపేరు ‘none of your business’. వివిధ దేశాల్లో యాపిల్‌ కంపెనీపై ఈ సంస్థ ఫిర్యాదు చేస్తోంది. యాపిల్ చేస్తున్న ఈ ట్రాకింగ్ చట్టబద్ధతను పరిశీలించాలని జర్మనీ, స్పెయిన్‌లోని డేటా ప్రొటెక్షన్ అధికారులను కోరినట్లు ఈ సంస్థ సోమవారం పేర్కొంది.

ట్రాకింగ్ కోసం యాపిల్ వాడుతన్న కోడ్స్‌ను IDFA లేదా ఐడెంటిఫయర్ ఫర్ అడ్వటైజర్స్ అని పిలుస్తారు. ఇవి సమాచారాన్ని స్టోర్‌ చేయడానికి వెబ్‌సైట్లు ఉపయోగించే కుకీస్ మాదిరిగానే ఉంటాయి. కానీ వీటిని యాపిల్ సంస్థ వినియోగదారుల ప్రవర్తనను ట్రాక్ చేయడానికి అక్రమంగా ఉపయోగిస్తుందని కొంతమంది కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. ప్రతి ఐఫోన్ కోసం IOS ఆపరేటింగ్ సిస్టమ్ ప్రత్యేకంగా కోడ్స్‌ను సృష్టిస్తుందని NOYB అంటోంది. వీటి ద్వారా యాపిల్, ఇతర థర్డ్ పార్టీ యాప్‌ల వినియోగదారుల ఆన్‌లైన్, మొబైల్ బిహేవియర్‌ను ఆ సంస్థ తెలుసుకుంటోందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. యూజర్లకు తెలియకుండా, వారి అనుమతి తీసుకోకుండా ట్రాకింగ్ చేస్తున్నారని ఎన్‌ఓవైబీ సంస్థ చెబుతోంది. ఇలాంటి ప్రయత్నాలను యూరోపియన్ యూనియన్ ఎలక్ట్రానిక్ ప్రైవసీ రూల్స్‌ నిషేధించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.

అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రైవసీ, సెక్యూరిటీకి సంబంధించిన అంశాలను తీవ్రంగా పరిగణిస్తారు. వినియోగదారులు స్పష్టంగా అంగీకరిస్తేనే వివిధ సంస్థలకు ట్రాకింగ్‌ అనుమతి లభిస్తుందని NOYB తరఫు న్యాయవాది స్టెఫానో రోసెట్టి చెబుతున్నారు. ప్రస్తుతం గూగుల్ ఉపయోగించే ఇలాంటి వ్యవస్థను తాము సమీక్షిస్తున్నట్లు ఈ ప్రైవసీ హక్కుల సంఘం తెలిపింది. ప్రైవసీ హక్కుల కార్యకర్త, లాయర్‌ మాక్స్ ష్రెమ్స్ NOYB సంస్థను స్థాపించారు. నిబంధనలు అతిక్రమించినందుకు ఫేస్‌బుక్‌ సహా ఇతర పెద్ద టెక్ కంపెనీలపై ఆయన ఎన్నో సార్లు కేసులు పెట్టారు. అమెరికాతో డేటాను పంచుకోవడానికి అంగీకరించిన కంపెనీలపై ఆయన ఇటీవల న్యాయ పోరాటం చేశారు. ఈ ఒప్పందాన్ని యూరోపియన్ యూనియన్ అత్యున్నత న్యాయస్థానం రద్దు చేసి మాక్స్‌కు అనుకూలంగా తీర్పు ఇవ్వడం విశేషం. ఈ ఆరోపణలపై యాపిల్ స్పందించింది. ఇది వాస్తవం కాదని, తాము ఐడీఎఫ్ఓ కోడ్‌ను యాక్సెస్ చేయట్లేదని, ఈ కోడ్‌ను ఎందుకోసం ఉపయోగించట్లేదని యాపిల్ స్పష్టం చేసింది. ప్రైవసీ రెగ్యులేటర్‌లు ఈ ఫిర్యాదును పరిశీలించాలని యాపిల్ కోరింది.

Tags :
|

Advertisement