Advertisement

  • అమెజాన్ లో యాపిల్ డేస్ సేల్.. మరింత తక్కువ ధరల్లో ఐఫోన్..

అమెజాన్ లో యాపిల్ డేస్ సేల్.. మరింత తక్కువ ధరల్లో ఐఫోన్..

By: chandrasekar Sat, 12 Dec 2020 11:16 AM

అమెజాన్ లో యాపిల్ డేస్ సేల్..  మరింత తక్కువ ధరల్లో ఐఫోన్..


ఆన్ లైన్ ఆఫర్లు ప్రజలను రెచ్చగొట్టి కొనేటట్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఐఫోన్ ప్రియులకు అమెజాన్ తన ప్లాట్‌ఫాంలో యాపిల్ డేస్ సేల్‌ను అందించింది. ప్రస్తుతం ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ 11, ఐఫోన్ 7, ఐప్యాడ్ మినీ, మ్యాక్ బుక్ బ్రో వంటి స్మార్ట్ ఫోన్లపై ఆఫర్లను అందించనున్నారు. డిసెంబర్ 16, 2020 వరకు ఈ సేల్ ఆన్ లైన్ లో జరగనుంది. ఇందులో ఐఫోన్ 11 స్మార్ట్ ఫోన్‌ను రూ.51,999కే ఈ సేల్‌లో కొనుగోలు చేయవచ్చును. ఈ ఆఫర్ లో భాగంగా యస్ బ్యాంక్ క్రెడిట్ కార్డు ఈఎంఐ ద్వారా కొనుగోలు చేస్తే మరో రూ.1,750 ఆఫర్ అందనుంది. అదే విధంగా ఐఫోన్ 7 ను రూ.23,999కే కొనుగోలు చేయవచ్చును.

ఐఫోన్ 11 ఫోన్ స్పెసిఫికేషన్స్ పరిశీలిస్తే

* ఇందులో 6.1 అంగుళాల ఎల్సీడీ లిక్విడ్ రెటీనా డిస్ ప్లేను అందించారు.

* ఈ ఫోన్ యాపిల్ ఏ13 బయోనిక్ చిప్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.

* ఇందులో 4 జీబీ ర్యామ్, 64 జీబీ/128 జీబీ/ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంది.

* ఈ ఫోన్ లో 3110 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.

* ఈ ఫోన్ లో వెనకవైపు రెండు కెమెరా అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 12 మెగాపిక్సెల్ గాను , 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా గాను ఉంది. సెల్ఫీల కోసం ముందువైపు 12 మెగాపిక్సెల్ ట్రూ డెప్త్ సెన్సార్‌ను అందించారు.

దీంతో బాటు యాపిల్ డేస్ సందర్భంగా ఇతర ఉత్పత్తులపై కూడా భారీ తగ్గింపులు అందించారు. ఐప్యాడ్ మినీపై రూ.5,000 వరకు తగ్గింపు లభించనుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో అదనంగా మరో రూ.3,000 తగ్గింపును అందించనున్నారు. వీటితో పాటు ప్రముఖ యాపిల్ మ్యాక్ బుక్ ప్రోపై కూడా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే దాదాపు రూ.6,000 ఇన్ స్టంట్ డిస్కౌంట్ అందనుంది. కావున ఆపిల్ ప్రియులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని చెప్పవచ్చు.

Tags :
|

Advertisement