Advertisement

యాపిల్ సంస్థ తాజా హెచ్చరికలు....

By: chandrasekar Mon, 07 Dec 2020 7:01 PM

యాపిల్ సంస్థ తాజా హెచ్చరికలు....


తమ వినియోగదారులకు మొబైల్ తయారీ సంస్థ యాపిల్ తాజాగా హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి వినియోగదారుడు తమ లాగిన్ అకౌంట్ వివరాలను బహిర్గతం చేయకూడదని ఫెడరల్ ట్రేడ్ కమిషన్ తన బ్లాగ్‏లో పోస్ట్ చేసింది. యాపిల్ వినియోగదారుడికి ఒక తెలియని వ్యక్తి నుంచి కాల్ వస్తుందని మీ అకౌంట్‏లో అనుమానిత కార్యాకలపాలు జరుగుతున్నాయంటూ చెబుతారని పేర్కొంది. అటువంటి కాల్స్ వచ్చిన వెంటనే ప్రతీ యూజర్ యాపిల్ కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్‏కు కాల్ చేసి తమ వ్యక్తిగత వివరాలను చెక్ చేయించుకొని, అకౌంట్‏ ఐడీని లాక్ చేసుకోవాలని పేర్కొంది.

మీ అకౌంట్లో తప్పు జరిగిందని స్కామర్లు భయపెట్టవచ్చని అలాగే అకౌంట్లను భద్రపరచడానికి స్కామర్లు ఒకటి లేదా ఎదైనా నంబర్ ప్రెస్ చేయమని చెబుతారని ఇలాంటి కాల్స్ వస్తే యూజర్లు ఎలాంటి నంబర్లను క్లిక్ చేయకూడదని, హెచ్చరించింది. ఇలాంటి స్కామ్ లు చాలా వరకు జరుగుతుంటాయని, అయితే వినియోగదారులు భయపడాల్సిన పనిలేదని, కాల్ రాగానే వెంటనే తమ అకౌంట్ డీటెయిల్స్, పర్సనల్ ఇన్ఫర్మేషన్‏తోపాటు బ్యాంకు డీటెయిల్స్, లాగిన్ ఐడిలను వెరీఫై చేయించుకోవాలని పేర్కొంది. ఇందులో ఎక్కువగా స్కామర్లు యూజర్ల క్రెడిట్, డెబిట్ కార్డ్స్ డీటెయిల్స్ అడుగుతారని, వినియోగదారలు అలాంటి వివరాలు ఇవ్వకూడదని వెల్లడించింది. యాపిల్ సంస్థ నిజమైన కస్టమర్ సపోర్ట్ రిప్రజెంటేటీవ్ ఎప్పుడు కూడా ఎలాంటి పర్సనల్ డీటెయిల్స్ లేదా బ్యాంకింగ్ డీటెయిల్స్ అడగరని యాపిల్ సంస్థ తెలియ జేసింది.

Tags :
|
|

Advertisement