Advertisement

  • నదీ జలాల వివాదాల ముగింపుకు అపెక్స్ కౌన్సిల్ భేటీకి మరొకసారి తేదీ ప్రకటన

నదీ జలాల వివాదాల ముగింపుకు అపెక్స్ కౌన్సిల్ భేటీకి మరొకసారి తేదీ ప్రకటన

By: Sankar Mon, 28 Sept 2020 8:53 PM

నదీ జలాల వివాదాల ముగింపుకు అపెక్స్ కౌన్సిల్ భేటీకి మరొకసారి తేదీ ప్రకటన


తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల వివాదాల పరిష్కారానికి అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశం తేదీని మరోసారి ప్రకటించింది కేంద్రం... ఇప్పటికే ఈ సమావేశం పలు దఫాలుగా వాయిదా పడుతూ వచ్చింది.. తొలిసారి తెలంగాణ సీఎం కేసీఆర్‌ విజ్ఞప్తితో వాయిదా పడగా.. ఆ తర్వాత రకరకాల కారణాలతో మూడు, నాలు దఫాలుగా వాయిదా పడింది..

మొత్తానికి అక్టోబర్ 6వ తేదీన అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగనున్నట్టు కేంద్ర జలశక్తి శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న నదీ జలాలు, ప్రాజెక్టుల వివాదంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు.. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు లేవనెత్తిన అంశాలను అపెక్స్ కౌన్సిల్ చర్చించనుంది. ఈ సమావేశానికి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ నేతృత్వం వహించనుండగా... అపెక్స్‌ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్న ఏపీ సీఎం వైఎస్ జగన్‌, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరుకానున్నారు.

కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి, జల వివాదాలు.. తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరి ఈ సమావేశంలో సమస్యలపై ఏ స్థాయిలో చర్చ సాగుతోంది.. వివాదాల పరిష్కారానికి ముందుడుగు పడుతుందా? అనే విషయం వేచిచూడాల్సిందే.

Tags :
|

Advertisement