Advertisement

  • లోపలి వెళ్లకుండ అడ్డుకున్నందుకు వాచ్ మెన్ ను చితకబాదిన మహిళ

లోపలి వెళ్లకుండ అడ్డుకున్నందుకు వాచ్ మెన్ ను చితకబాదిన మహిళ

By: Sankar Tue, 25 Aug 2020 3:36 PM

లోపలి వెళ్లకుండ అడ్డుకున్నందుకు వాచ్ మెన్ ను చితకబాదిన మహిళ


హైదరాబాద్‌లోని చందానగర్ దారుణం చోటుచేసుకుంది. అపార్ట్‌మెంట్ వాచ్ మెన్‌గా పనిచేస్తున్న వ్యక్తిని ఓ మహిళ చావబాదింది. అపార్ట్‌మెంట్‌లోకి వచ్చేందుకు బయటవారికి అనుమతి లేదని అడ్డుకున్నందుకు అతడ్ని తీవ్రంగా కొట్టింది. ఈ ఘటన చందానగర్ సిరి అపార్ట్ మెంట్‌లో చోటు చేసుకుంది. అపార్ట్ మెంట్‌లోకి వెళ్లకుండా వాచ్ మెన్ అడ్డుకోవడంతో ఆగ్రహంతో మహిళ వాచ్ మెన్ ని చితకబాదింది.

స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం యువతి అనుమతి లేకుండా కారు తీసుకుని అపార్ట్ మెంట్ లోకి వెళ్తోంది. దీంతో ఆ సమయంలో అక్కడే ఉనన వాచ్ మెన్ గమనించి ఇతరులకు అపార్ట్ మెంట్ లోకి ప్రవేశించడానికి అనుమతి లేదంటూ నిలిపి వేశాడు. దీంతో ఆ మహిళ ఆగ్రహంతో కారు దిగింది. వెంటనే వాచ్ మెన్‌పై దాడి చేసింది. దీంతో వాచ్ మెన్ చందానగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

కరోనా వైరస్ కారణంగా అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్నావారు, గేటెడ్ కమ్యూనిటీస్‌లో నివసించే వాళ్లు ఇతరుల్ని లోపలికి అనుమతించేందుకు నిరాకరించారు. కరోనా కారణంగా దాదాపు అందరూ ఇలాంటి నిబంధనలే పెట్టుకున్నారు

Tags :
|
|

Advertisement