Advertisement

  • ఆరోగ్య ఆసరా స్కీం పథకం ప్రోత్సాహకాన్ని పెంచిన ఏపీ సర్కార్

ఆరోగ్య ఆసరా స్కీం పథకం ప్రోత్సాహకాన్ని పెంచిన ఏపీ సర్కార్

By: Sankar Fri, 18 Sept 2020 4:37 PM

ఆరోగ్య ఆసరా స్కీం పథకం ప్రోత్సాహకాన్ని పెంచిన ఏపీ సర్కార్


ఆంధ్ర​ప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద ప్రోత్సాహకం పెంచుతున్నట్లు ప్రకటించారు. సాధారణ ప్రసవానికి ప్రస్తుతం ఇస్తున్న 3వేల రూపాయల ప్రోత్సాహకాన్ని 5వేల రూపాయలకు, సిజేరిన్ ప్రసవానికి సంబంధించి ప్రోత్సాహకాన్ని 1000 నుంచి 3 వేల రూపాయలకు పెంచుతూ శుక్రవారం నిర్ణయం తీసుకున్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆస్పత్రి సేవలు అధ్వాన్నంగా ఉన్న జిల్లాలపై దృష్టి పెట్టాలని, రెండు వారాల్లో పరిస్థితి మెరుగు పడాలని అధికారులను ఆదేశించారు. ఆరోగ్య శ్రీ నెట్ వర్క్ ఆస్పత్రుల్లో అన్ని నిబంధనలు పాటించాలని, 6 నెలల తర్వాత పరిస్థితులు మెరుగుపడకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాల్లో ఆరోగ్య శ్రీ కో ఆర్డినేషన్ బాధ్యతలు ఇక నుంచి జేసీలకి అప్పజెప్పాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఇక ఏపీలో ఒక్క రోజులోనే రేషన్ కార్డు మంజూరైంది. దరఖాస్తు చేసుకున్న రోజే కొత్త కార్డు వచ్చేసింది.. సరికొత్త రికార్డు నమోదైనట్లైంది. తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం మడికి పంచాయతీ సచివాలయం–2 పరిధిలో నివాసం ఉంటున్న కుడిపూడి ఆంజనేయులు, వరలక్ష్మి దంపతులు గతంలో ఎన్నోసార్లు రేషన్‌ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నా రాలేదు.

దీంతో గ్రామ వాలంటీర్‌‌ను కలవగా.. మంగళవారం గ్రామ సచివాలయానికి తీసుకెళ్లి వివరాలు నమోదు చేయించాడు. దరఖాస్తును ఆన్‌లైన్‌ ద్వారా తహసీల్దార్‌ సమర్పించగా.. ఆయన వెంటనే లబ్ధిదారుని అర్హతల్ని గుర్తించి బుధవారం రేషన్‌ కార్డు మంజూరు చేశారు. అలాగే అదే గ్రామానికి చెందిన పిల్లి లక్ష్మి అనే ఒంటరి మహిళకు కూడా ఒక్క రోజులోనే రేషన్‌ కార్డు మంజూరు చేశారు.

Tags :
|

Advertisement