Advertisement

  • ఏపీలో ఆగని కరోనా మరణాలు ..గడిచిన 24 గంటల్లో ఎంత మంది మరణించారో తెలుసా

ఏపీలో ఆగని కరోనా మరణాలు ..గడిచిన 24 గంటల్లో ఎంత మంది మరణించారో తెలుసా

By: Sankar Wed, 19 Aug 2020 5:07 PM

ఏపీలో ఆగని కరోనా మరణాలు ..గడిచిన 24 గంటల్లో ఎంత మంది మరణించారో తెలుసా


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా 9,742 కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్‌లో తెలిపింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 3 లక్షల 16,003కి చేరింది. గత 24గంటల్లో 86 మరణాలు సంభవించాయని ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు కరోనా బారినపడి మృతిచెందిన వారి సంఖ్య 2,906కు పెరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం 86,725 యాక్టివ్‌ కేసులున్నాయి. కరోనా నుంచి కోలుకొని 2 లక్షల 26వేల 372కు పెరిగింది. ఏపీలో కోవిడ్‌-19 టెస్టులు 30లక్షలు దాటాయి. 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 8,061 మంది డిశ్చార్జ్‌ అయ్యారు.

ఇక, కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 15 మంది, నెల్లూరులో 15 మంది, అనంతపురంలో 8 మంది, గుంటూరులో ఏడుగురు, ప్రకాశంలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఆరుగురు, తూర్పు గోదావరిలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, కడపలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

Tags :
|
|
|
|
|

Advertisement