Advertisement

  • ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు..తాజాగా ఎన్ని కేసులో తెలుసా !

ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు..తాజాగా ఎన్ని కేసులో తెలుసా !

By: Sankar Tue, 18 Aug 2020 6:25 PM

ఏపీలో మళ్ళీ భారీగా పెరిగిన కరోనా కేసులు..తాజాగా ఎన్ని కేసులో తెలుసా !


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు మళ్లీ భారీగా పెరిగాయి. గత మూడు రోజులుగా కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపించినా మంగళవారం ఒక్కసారిగా భారీ సంఖ్యలో నమోదయ్యాయి. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా 6,780 కేసులు నమోదు కాగా, మంగళవారం ఏకంగా 9,652 కేసులు నమోదయ్యాయి.

దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 56,090 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 9,652 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 3,06,261కు చేరింది.

కరోనా వైరస్ మరణాలు కూడా మంగళవారం భారీగా నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో ఏకంగా 88 మంది కరోనా మహమ్మారి బారినపడి మృతి చెందారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా మరణాల సంఖ్య 2,820కు పెరిగింది. ఇక, కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో చిత్తూరు జిల్లాలో 14 మంది, ప్రకాశంలో 11 మంది, అనంతపురంలో 9 మంది, గుంటూరులో 9 మంది, కర్నూలులో 9 మంది, నెల్లూరులో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఆరుగురు, శ్రీకాకుళంలో ఐదుగురు, విశాఖపట్నంలో ఐదుగురు, విజయనగరంలో ఐదుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, కృష్ణాలో ముగ్గురు, కడపలో ఒకరు మృత్యువాత పడ్డారు.

Tags :
|
|
|
|

Advertisement