Advertisement

ఏపీలో తాజా కరోనా కేసులు ఎన్నంటే !

By: Sankar Sun, 13 Sept 2020 7:19 PM

ఏపీలో తాజా కరోనా కేసులు ఎన్నంటే !


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 9536 కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 5,67,123కి చేరింది. ఇందులో 95,072 కేసులు యాక్టివ్ గా ఉండగా, 4,67,139 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 66 మంది కరోనాతో మరణించారు.

దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4912కి చేరింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే, అనంతపూర్ జిల్లాలో 521, చిత్తూరులో 957, తూర్పు గోదావరి జిల్లాలో 1414, గుంటూరులో 792, కడపలో 585, కర్నూలులో 441, కృష్ణా జిల్లాలో 397, నెల్లూరులో 844, ప్రకాశం జిల్లాలో 788, శ్రీకాకుళం జిల్లాలో 733, విశాఖపట్నంలో 415, విజయనగరంలో 573, పశ్చిమ గోదావరి జిల్లాలో 1076 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement