Advertisement

  • ఏపీలో 69 తాజా కరోనా మరణాలు ..5000 లకు చేరిన మొత్తం మరణాలు

ఏపీలో 69 తాజా కరోనా మరణాలు ..5000 లకు చేరిన మొత్తం మరణాలు

By: Sankar Tue, 15 Sept 2020 8:33 PM

ఏపీలో 69 తాజా కరోనా మరణాలు ..5000 లకు చేరిన మొత్తం మరణాలు


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ కేసులు భారీగానే నమోదు అవుతున్నాయి.. గత కొన్ని రోజులుగా పాజిటివ్‌ కేసులు రికార్డు సంఖ్యలో పెరుగుతూ పోగా.. అదే సమయంలో. రికవరీ అయ్యేవారి సంఖ్య తగ్గింది. కానీ, తాజా లెక్కల ప్రకారం.. ఏపీలో రికవరీ రేటు పెరిగిపోయింది.

ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా హెల్త్ బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 70,511 కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 8846 కొత్త కేసులు నమోదు అయ్యాయి.. 69 మంది మృతిచెందారు. ఇదే సమయంలో 9,628 మంది రికవరీ అయ్యారు. అయితే, కరోనా మృతుల సంఖ్య 5 వేల మార్క్‌ను కూడా క్రాస్ చేసింది.

రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,83,925కు చేరగా.. ఇప్పటి వరకు 5,041 మంది మృతిచెందారు... ఇక, 4,86,531 మంది కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 92,353 యాక్టివ్ కేసులు ఉన్నట్టు కరోనా హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది ఏపీ సర్కార్.

ఇవాళ అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 10 మంది మృతిచెందగా.. చిత్తూరులో తొమ్మిది మంది, అనంతపురం, తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాల్లో ఆరుగురు చొప్పున, కడప, విశాఖపట్నంలో ఐదుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, కర్నూలు, శ్రీకాకుళం జిల్లాల్లో ముగ్గురు చొప్పున మృతిచెందారు.

Tags :
|
|

Advertisement