Advertisement

ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !

By: Sankar Sun, 16 Aug 2020 09:55 AM

ఏపీలో కొత్తగా ఎన్ని కరోనా కేసులో తెలుసా !


ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 53,712 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 8,732 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా పరీక్షల్లో 31,814 ట్రూనాట్‌ పద్ధతిలో, 21,898 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,81,817 కు చేరింది. కొత్తగా 10,414 మంది వైరస్‌ బాధితులు కోలుకుని శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,91,117 కి చేరింది.

రాష్ట్రవ్యాప్తంగా 88,138 యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 87 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2562 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. కాగా, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 28,12,197 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది.

జిల్లాల వారీగా చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 1126, చిత్తూరు లో 959, విశాఖపట్నంలో 894, అనంతపూర్ లో 851, కర్నూల్ లో 734, శ్రీకాకుళం లో 638, వెస్ట్ గోదావరిలో 612, గుంటూరు లో 609, నెల్లూరు 572, విజయనగరం 561, కడప 389, కృష్ణ 298 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి

Tags :
|
|
|
|

Advertisement