Advertisement

  • ఏపీలో కొద్దిగా తగ్గిన కరోనా కేసులు..5 లక్షలు దాటిన మొత్తం కేసులు

ఏపీలో కొద్దిగా తగ్గిన కరోనా కేసులు..5 లక్షలు దాటిన మొత్తం కేసులు

By: Sankar Mon, 07 Sept 2020 5:48 PM

ఏపీలో కొద్దిగా తగ్గిన కరోనా కేసులు..5 లక్షలు దాటిన మొత్తం కేసులు


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు గత కొద్దీ రోజుల్లో నమోదు అయిన వాటితో పోలిస్తే కొంచెం తగ్గుముఖం పట్టాయి . గడిచిన 24 గంటల్లో ఏపీలో 8368 కొత్త కేసులు నమోదయ్యాయి.

దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,06,493కి చేరింది. ఇందులో 97,932 కేసులు యాక్టివ్ గా ఉండగా, 4,04,074 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 70 మరణాలు సంభవించాయి. ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 4487 కి చేరింది. ఆదివారం ఒకే రోజు 58,157 టెస్టులు చేయగా.. ఇప్పటి వరకు 41,66,077 శాంపిల్స్‌ పరీక్షించినట్లు వైద్య, ఆరోగ్యశాఖ వివరించింది.

ఇక ఇదిలా ఉంటె, జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 584, చిత్తూరులో 875, తూర్పు గోదావరి జిల్లాలో 1312, గుంటూరు జిల్లాలో 765, కడప జిల్లాలో 447, కృష్ణా జిల్లాలో 193, కర్నూల్ జిల్లాలో 316, నెల్లూరులో 949, ప్రకాశం జిల్లాలో 419, శ్రీకాకుళం జిల్లాలో 559, విశాఖపట్నంలో 405, విజయనగరం జిల్లాలో 594, పశ్చిమ గోదావరి జిల్లాలో 950 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement