Advertisement

ఏపీలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే !

By: Sankar Tue, 01 Dec 2020 8:10 PM

ఏపీలో కొత్త కరోనా కేసులు ఎన్నంటే !


గత కొద్దీ రోజులుగా ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్ళీ పెరగడం ప్రారంభించాయి..తాజా కరోనా బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 685 కరోనా కేసులు నమోదయ్యాయి.

దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,68,749 కి చేరింది. ఇందులో 8,54,326 మంది ఇప్పటికే డిశ్చార్జ్ కాగా, 7,427 కేసులు ఇంకా యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 4 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,996 కి చేరింది.

అలానే జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 18, చిత్తూరులో 95, తూర్పుగోదావరి జిల్లాలో 70, గుంటూరులో 87, కడపలో 30, కృష్ణాలో 146, కర్నూలులో 10, నెల్లూరులో39, ప్రకాశంలో 30, శ్రీకాకుళంలో 3, విశాఖపట్నంలో 71, విజయనగరంలో 9, పశ్చిమ గోదావరిలో 77 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement