Advertisement

ఏపీలో 506 కొత్త కరోనా కేసులు

By: Sankar Sun, 13 Dec 2020 5:43 PM

ఏపీలో 506 కొత్త కరోనా కేసులు


ఏపీలో కరోనా కేసులు ఒకరోజు తగ్గితే ఇంకో రోజు పెరుగుతున్నాయి ..కానీ ఇంతకుముందుతో పోల్చుకుంటే మాత్రం కరోనా చాల వరకు తగ్గుముఖం పట్టింది...ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో 506 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 87,5531 కు చేరింది.

ఇందులో 8,63, 508 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 4966 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు కరోనాతో 7057 మంది మృతి చెందారు. పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతున్నప్పటికీ కరోనా ఉధృతి పూర్తిగా తగ్గిపోలేదని, జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇక జిల్లా వారీగా చూస్తే అనంతపురంలో 17, చిత్తూరులో 104, తూర్పుగోదావరి జిల్లాలో 41, గుంటూరులో 69, కడపలో 12, కృష్ణాలో 59, కర్నూలులో 28, నెల్లూరులో 29, ప్రకాశంలో 20, శ్రీకాకుళంలో 25, విశాఖపట్నంలో 23, విజయనగరంలో 13, పశ్చిమ గోదావరిలో 66 కేసులు నమోదయ్యాయి

Tags :
|
|

Advertisement