Advertisement

  • ఏపీలో వణుకు పుట్టిస్తున్న కరోనా ..5 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు

ఏపీలో వణుకు పుట్టిస్తున్న కరోనా ..5 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు

By: Sankar Sun, 06 Sept 2020 8:06 PM

ఏపీలో వణుకు పుట్టిస్తున్న కరోనా ..5 లక్షలకు చేరువలో పాజిటివ్ కేసులు


ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలో కొత్తగా 10,794 కేసులు నమోదయ్యాయి.

దీంతో ఏపీలో ఇప్పటి వరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 4,98,125 కి చేరింది. ఇందులో 99,689 కేసులు యాక్టివ్ గా ఉంటె, 3,94,019 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇక ఇదిలా ఉంటె, గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 70 మంది మృతి చెందారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 4417కి చేరింది.

ఇక రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదైన కరోనా పాజిటివ్ కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురంలో 753, చిత్తూరులో 927, తూర్పు గోదావరి జిల్లాలో 1244, గుంటూరు జిల్లాలో 703, కడపలో 904, కృష్ణా జిల్లాలో 457, కర్నూలులో 380, నెల్లూరు జిల్లాలో 1299, ప్రకాశం జిల్లాలో 1042, శ్రీకాకుళం జిల్లాలో 818, విశాఖపట్నంలో 573, విజయనగరం జిల్లాలో 593, పశ్చిమ గోదావరి జిల్లాలో 1101 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement