Advertisement

  • ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు.. కొత్తగా 73 కరోనా మరణాలు

ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు.. కొత్తగా 73 కరోనా మరణాలు

By: Sankar Tue, 08 Sept 2020 7:34 PM

ఏపీలో భారీగా కరోనా కేసులు నమోదు.. కొత్తగా 73 కరోనా మరణాలు


ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్‌ ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 70,993 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 10,601 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 5,17,094కు చేరింది. కొత్తగా 73 మంది మరణించగా మొత్తం ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,560కు చేరింది. సోమవారం 11,691 మంది కరోనా నుంచి కోలుకోని డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది..

ఇప్పటి వరకు ఏపీలో 4,15,765 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 96,769 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు 42,37,070 కోవిడ్‌ టెస్టులు చేశారు. కరోనా కారణంగా నిన్న గుంటూరులో 10 మంది, అనంతపూర్‌లో 8, చిత్తూరులో 8, కడపలో 7, ప్రకాశంలో 7, నెల్లూరులో 6, విశాఖపట్నంలో 6, తూర్పుగోదావరిలో 5, కృష్ణా5, పశ్చిమగోదావరిలో 5, శ్రీకాకుళంలో 3, కర్నూలులో 2,విజయనగంలో 1 చొప్పున మరణించారు..

తాజా హెల్త్ బులెటిన్ ప్రకారం ఏపీలోని జిల్లాల్లో నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపూర్ లో 441, చిత్తూరులో 1178, తూర్పు గోదావరి జిల్లాలో 1426, గుంటూరులో 702, కడపలో 801, కృష్ణా జిల్లాలో 389, కర్నూలులో 514, నెల్లూరులో 1042, ప్రకాశం జిల్లాలో 1457, శ్రీకాకుళం జిల్లాలో 505, విశాఖపట్నం జిల్లాలో 426, విజయనగరంలో 598, పశ్చిమ గోదావరి జిల్లాలో 1122 కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement