Advertisement

  • ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు ..తాజాగా 9024 పాజిటివ్ కేసులు

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు ..తాజాగా 9024 పాజిటివ్ కేసులు

By: Sankar Tue, 11 Aug 2020 7:11 PM

ఏపీలో మళ్ళీ పెరిగిన కరోనా కేసులు ..తాజాగా 9024 పాజిటివ్ కేసులు



ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో 58,315 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 9,024 మందికి పాజిటివ్‌గా తేలింది. తాజా పరీక్షల్లో 27,407 ట్రూనాట్‌ పద్ధతిలో, 30,908 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రవ్యాప్తంగా పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,44,549 కు చేరింది.

కొత్తగా 9,113 మంది వైరస్‌ బాధితులు కోలుకుని మంగళవారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 1,54,749 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 87,597 యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ బాధితుల్లో కొత్తగా 87 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 2203 కు చేరింది.

ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. కాగా, రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 25,92,619 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వైద్యారోగ్యశాఖ తెలిపింది. ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 1372 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఆ తర్వాత కర్నూల్ లో 1138, అనంతపూర్ లో 959 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి


Tags :
|
|
|
|
|

Advertisement