Advertisement

  • కరోనా దాటికి అల్లాడుతున్న ఏపీ ..ఒక్కరోజే 8,147 కొత్త పాజిటివ్ కేసులు

కరోనా దాటికి అల్లాడుతున్న ఏపీ ..ఒక్కరోజే 8,147 కొత్త పాజిటివ్ కేసులు

By: Sankar Sat, 25 July 2020 07:21 AM

కరోనా దాటికి అల్లాడుతున్న ఏపీ ..ఒక్కరోజే 8,147 కొత్త పాజిటివ్ కేసులు



ఏపీలో కరోనా వైరస్ ప్రకంపనలు రేపుతోంది. ప్రతి రోజూ రికార్డులు బద్దలయ్యేలా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా టెస్టులు భారీగా నిర్వహిస్తుండగా.. కేసులు కూడా అంతే స్థాయిలో నమోదవుతున్నాయి. శుక్రవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో మరోసారి రికార్డు బ్రేక్ చేసే స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే ఒకే రోజు ఏకంగా 49 మంది మృతి చెందారు. గత 24 గంటల్లో 48,114 మందికి పరీక్షలు నిర్వహించగా ఏకంగా 8,147 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 80,858కు చేరింది.

గత 24 గంటల్లో అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 1,029 కేసులు నమోదయ్యాయి. తర్వాత అనంతపురం జిల్లాలో 984, కర్నూలు జిల్లాలో 914 కేసులు వచ్చాయి. ఇక చిత్తూరులో 630, కడపలో 497, కృష్ణా జిల్లాలో 359, నెల్లూరులో 278, ప్రకాశంలో 355, శ్రీకాకుళంలో 374, విశాఖపట్నంలో 898, విజయనగరంలో 322, పశ్చిమ గోదావరిలో 807 కేసులు నమోదయ్యాయి..

ఇక గడిచిన 24 గంటల్లో 2,380 మంది కోలుకున్నారని ఆరోగ్య శాఖ తెలిపింది. దీంతో రాష్ట్రంలో నమోదైన మొత్తం 80,858 పాజిటివ్ కేసులకు గాను 39,935 మంది డిశ్చార్జ్ కాగా, 39,990 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

గడచిన 24 గంటల్లో ఏకంగా 49 మంది చనిపోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 933కు చేరింది. గడిచిన 24 గంటల్లో తూర్పు గోదావరి జిల్లాలో 11 మంది మృత్యువాత పడగా, కృష్ణా జిల్లాలో 9 మంది, కర్నూలులో 8 మంది, శ్రీకాకుళంలో ఏడుగురు, పశ్చిమ గోదావరిలో ఐదుగురు, గుంటూరులో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరులో ఒకరు, ప్రకాశంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మరణించారు.



Tags :
|
|
|
|
|
|

Advertisement