Advertisement

  • ఏపీలో గడిచిన 24 గంటల్లో 7813 కరోనా పాజిటివ్ కేసులు ..

ఏపీలో గడిచిన 24 గంటల్లో 7813 కరోనా పాజిటివ్ కేసులు ..

By: Sankar Sun, 26 July 2020 09:18 AM

ఏపీలో గడిచిన 24 గంటల్లో 7813 కరోనా పాజిటివ్ కేసులు ..



ఆంధ్రప్రదేశ్ లో కరోనా పరిస్థితిలో ఏ మాత్రం మార్పు రాలేదు ..గడిచిన 24 గంటల్లో కూడా భారీగా కరోనా కేసులు నమోదు అయ్యాయి..గడిచిన 24 గంటల్లో 53,681 కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా 7,813 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 88,671 కు చేరింది. తాజా పరీక్షల్లో 27,955 ట్రూనాట్‌ పద్ధతిలో, 25,726 ర్యాపిడ్‌ టెస్టింగ్‌ పద్ధతిలో చేశారు.

కొత్తగా 3,208 మంది వైరస్‌ బాధితులు కోలుకుని శనివారం డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో కోలుకున్నవారి మొత్తం సంఖ్య 43,255 కి చేరింది. రాష్ట్రవ్యాప్తంగా 44,431 యాక్టివ్‌ కేసులున్నాయి. వైరస్‌ బాధితుల్లో తాజాగా 52 మంది మృతి చెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 985 కు చేరింది. ఈమేరకు ఆంధ్రప్రదేశ్‌ వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 15,95,674 కరోనా నిర్ధారణ పరీక్షలు చేశామని వెల్లడించింది..

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఈస్ట్ గోదావరి జిల్లాలో అత్యధికంగా 1324 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఇక వెస్ట్ గోదావరి జిల్లాలో కూడా 1012 పాజిటివ్ కేసులు వచ్చాయి..ఇక విశాఖపట్నంలో 936 , కర్నూలు లో 742 , అనంతపూర్ లో 723 , ఇక గుంటూరు లో 656 కేసులు నమోదు అయ్యాయి..

Tags :
|
|

Advertisement