Advertisement

  • ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు ..తాజాగా ఎన్నో తెలుసా !

ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు ..తాజాగా ఎన్నో తెలుసా !

By: Sankar Mon, 21 Sept 2020 6:40 PM

ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు ..తాజాగా ఎన్నో తెలుసా !


ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో 6235 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో ఏపీలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,31,749 కి చేరింది. ఇందులో 74518 కేసులు యాక్టివ్ గా ఉండగా, 5,51,821 మంది కోలుకొని డిశార్జ్ అయ్యారు.

ఇక గడిచిన 24 గంటల్లో ఏపీలో కరోనాతో 51 మంది మరణించారు. దీంతో ఏపీలో నమోదైన మొత్తం మరణాల సంఖ్య 5410కి చేరింది. ఇక ఇదిలా ఉంటె, ఆంధ్రప్రదేశ్ లోని జిల్లాల్లో ఒక్కరోజులో నమోదైన కేసుల సంఖ్య ఇలా ఉన్నది. అనంతపూర్ లో 505, చిత్తూరులో 362, తూర్పు గోదావరిలో 1262, గుంటూరులో 532, కడపలో 219, కృష్ణాలో 133, కర్నూలులో 190, నెల్లూరులో 401, ప్రకాశంలో 841, శ్రీకాకుళంలో 283, విశాఖపట్నంలో 150, విజయనగరంలో 395, పశ్చిమ గోదావరిలో 962 కేసులు నమోదయ్యాయి.

గత రెండు రోజులుగా ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. అయితే, తూర్పు గోదావరిలో మాత్రం కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. ఏపీలో అత్యధిక కేసులునమోదు అయ్యే జిల్లాలలో చాలాకాలంగా తూర్పు గోదావరి ప్రధమ స్థానంలో ఉంది..

Tags :
|
|

Advertisement