Advertisement

  • ఏపీ లో ఆగని కరోనా ఉదృతి ..గడిచిన 24 గంటల్లో 2592 పాజిటివ్ కేసులు నమోదు..

ఏపీ లో ఆగని కరోనా ఉదృతి ..గడిచిన 24 గంటల్లో 2592 పాజిటివ్ కేసులు నమోదు..

By: Sankar Fri, 17 July 2020 5:15 PM

ఏపీ లో ఆగని కరోనా ఉదృతి ..గడిచిన 24 గంటల్లో 2592 పాజిటివ్ కేసులు నమోదు..



ఏపీలో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదు అవుతున్నాయి ..వారంరోజుల కింద వరకు మామూలుగానే ఉన్న కరోనా ..గత వారంనుంచి మాత్రం తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది ..తాజాగా ఏపీలో 2592 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి .. వీటితో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 8 మందికి, విదేశాల నుంచి వచ్చిన వారిలో ఇద్దరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 40,646కు చేరుకుంది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది..

గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకుని 837 మంది క్షేమంగా డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,298 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. గత 24 గంటల్లో కరోనా బారిన పడి అనంతపురంలో ఆరుగురు, చిత్తూరులో ఐదుగురు, తూర్పుగోదావరిలో ఐదుగురు, ప్రకాశంలో ఐదుగురు, గుంటూరులో నలుగురు, పశ్చిమగోదావరిలో నలుగురు, కడపలో ముగ్గురు, విశాఖపట్నంలో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు,కృష్ణాలో ఒక్కరు.. మొత్తం 42 మంది మృతి చెందారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 534 మరణించారు.

గత 24 గంటల్లో 20,245 శాంపిల్స్‌ పరీక్షించగా, ఇప్పటివరకు రాష్ట్రంలో 12,60,512 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో 19,814 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి..కాగా గత 24 గంటల్లో అత్యదికంగా ఈస్ట్ గోదావరిలో 643 కేసులు నమోదు అయ్యాయి..ఆ తర్వాత గుంటూరులో , కర్నూల్ లో , చిత్తూర్ లో మూడొందలకు పైగా కేసులు నమోదు అయ్యాయి ..

Tags :
|
|

Advertisement