Advertisement

  • ఏపీలో షాకిస్తున్న కరోనా ..ఒక్కరోజే రికార్డు స్థాయిలో పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు

ఏపీలో షాకిస్తున్న కరోనా ..ఒక్కరోజే రికార్డు స్థాయిలో పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు

By: Sankar Wed, 29 July 2020 6:22 PM

ఏపీలో షాకిస్తున్న కరోనా ..ఒక్కరోజే రికార్డు స్థాయిలో పదివేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదు



ఏపీలో కరోనా కనీసం ఊహకు కూడా అందనంత స్థాయిలో విజృంభిస్తుంది..ఇప్పటిదాకా ఆరు వేలు , ఏడు వేళలో ఉన్న ఒక్క రోజు కరోనా పాజిటివ్ కేసులు గడిచిన 24 గంటల్లో అనూహ్యంగా పదివేలు దాటాయి..దీనితో ఏపీలో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ...కాగా గడచిన 24 గంటల్లో కరోనా నుంచి కోలుకున్న 2,784 మంది ఆస్పత్రుల నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 55,406కి చేరింది.

మంగళవారం ఉ. 9 గంటల నుంచి బుధవారం ఉ.9 గంటల వరకు 70,584 పరీక్షలు చేయగా 10,093 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,20,390కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 63,771 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కొత్తగా కరోనాతో 65 మంది మృతిచెందడంతో.. మొత్తం మరణాల సంఖ్య 1,213గా నమోదైంది. మరోవైపు రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 18,20,009 శాంపిల్స్‌ను పరీక్షించారు..

ఇక జిల్లాల వారీగా చూసుకుంటే ఈస్ట్ గోదావరిలో అత్యధికంగా 1676 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..ఇక గుంటూరు లో 1124 , కర్నూలు లో 1091 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి..విశాఖపట్నం , చిత్తూరు లలో 800 లకు పైగా కేసులు నిర్దారణ కాగా , వెస్ట్ గోదావరి , కడపలో 700 పైగా నమోదు అయ్యాయి

Tags :
|
|
|
|
|

Advertisement