Advertisement

ఏపీలో తగ్గని కరోనా ..తాజాగా 10080 పాజిటివ్ నమోదు

By: Sankar Sun, 09 Aug 2020 07:48 AM

ఏపీలో తగ్గని కరోనా ..తాజాగా 10080 పాజిటివ్ నమోదు



ఏపీలో కరోనా ఉదృతి ఏ మాత్రం తగ్గుముఖం పట్టడం లేదు ..గత పదిహేను రోజులుగా కరోనా కేసులు ఏపీలో తీవ్ర స్థాయిలో నమోదు అవుతున్నాయి ..తాజాగా గడిచిన 24 గంటల్లో 10,080 మందికి పాజిటివ్‌గా తేలడంతో మొత్తం కరోనా కేసులు 2,17,040కి చేరాయి..గడిచిన 24 గంటల్లో 97మంది కరోనాతో మృతి చెందారు. దీంతో ఏపీలో మొత్తం మరణాల సంఖ్య 1,939కి చేరింది. ఇక కరోనా నుంచి కోలుకొని గత 24 గంటల్లో 9,151 మంది డిశ్చార్జ్‌ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 85,486 యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి.

ఇక కరోనా టెస్టుల విషయంలో కూడా ఏపీ దూసుకుపోతుంది .. 24 గంటల్లో 62,123 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్టు వైద్యారోగ్యశాఖ శనివారం బులెటిన్‌లో పేర్కొంది. దీంతో ఇప్పటి వరకు నిర్వహించిన మొత్తం పరీక్షల సంఖ్య 24,24,393కి చేరింది..

జిల్లాల వారీగా చూసుకుంటే కర్నూలు లో అత్యధికంగా 1353, ఆ తర్వాత ఈస్ట్ గోదావరిలో 1310, విశాఖపట్నంలో 958, అనంతపురం , చిత్తూరులలో వరుసగా 976, 963, నెల్లూరు లో 878, వెస్ట్ గోదావరి 681, గుంటూరు 601, కడప 525, ప్రకాశం 512, విజయనగరం 450, శ్రీకాకుళంలో 442, కృష్ణ జిల్లాలో 391 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి ..

Tags :
|
|
|
|

Advertisement