Advertisement

  • విజయవాడ దగ్గర హవాలా గుట్టు రట్టు చేసిన AP పోలీసులు... భారీగా అమెరికన్ డాలర్లు

విజయవాడ దగ్గర హవాలా గుట్టు రట్టు చేసిన AP పోలీసులు... భారీగా అమెరికన్ డాలర్లు

By: chandrasekar Wed, 09 Sept 2020 09:41 AM

విజయవాడ దగ్గర హవాలా గుట్టు రట్టు చేసిన AP పోలీసులు... భారీగా అమెరికన్ డాలర్లు


వాహన తానికీలో భాగంగా విజయవాడ దగ్గర AP పోలీసులు హవాలా గుట్టు రట్టు చేసి భారీగా అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న హవాలా దందాను టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల బట్టబయలు చేశారు. విజయవాడ నగరంలోని గొల్లపూడి వద్ద టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు ఓ కారును తనిఖీ చేయగా అందులో 34 వేల అమెరికా డాలర్లు, రూ.1.47 ట్ల నగదును గుర్తించారు. పట్టుబడ్డ వారినుండి ఇంకా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు.

దొరికిన నగదుకు సంబంధించిన రసీదులు చూపించకపోవటంతో నలుగురిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం నుంచి హైదరాబాద్‌కు హవాలా మార్గంలో నగదు తరలిస్తున్నట్లు నిందితులు ఒప్పుకున్నారు. ఈ కేసులో ప్రవీణ్ జైన్ అనే కీలక నిందితుడితో పాటు మరో ముగ్గురిని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. కారులో ప్రత్యేక అరలు ఏర్పాటు చేసి నగదును రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీళ్ళు తరలించేదంతా నల్లధనమేనని విజయవాడ సీపీ బి.శ్రీనివాసులు వెల్లడించారు. నరసాపురం ప్రాంతంలో గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చేవారి వద్ద నుంచి తక్కువ ధరకు విదేశీ మారకద్రవ్యాన్ని కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించామని సీపీ శ్రీనివాసులు వెల్లడించారు.

విదేశాల నుండి వచ్చిన వారి నుండి తక్కువ ధరకే కొన్న ఈ డాలర్లను హైదరాబాద్‌లో ఎక్కువ ధరకు అమ్ముకుంటున్నారని విచారణలో తేలిందన్నారు. ఇదే ముఠా గతంలో నెల్లూరు జిల్లాలోనూ హవాలా చేస్తూ పట్టుబడ్డారన్నారు. వీరిపై భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశామని సీపీ వివరించారు. హవాలా మార్గంలో నగదు రవాణా చేస్తే ప్రభుత్వ ఖజానాకు రూ.కోట్లలో గండి పడుతుందని చెప్పారు. ప్రభుత్వానికి అందాల్సిన పన్ను ఎగవేయ బడుతుందని తెలియజేసారు.


Tags :
|

Advertisement