Advertisement

నిమ్మగడ్డ రమేశ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్...!

By: Anji Sun, 06 Dec 2020 12:57 PM

నిమ్మగడ్డ రమేశ్ పై మంత్రి కొడాలి నాని ఫైర్...!

ఎస్ఈసీ రమేశ్ కుమార్ గవర్నర్ కు రాసిన లేఖపై మంత్రి కొడాలి నాని స్పందించారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గవర్నర్ కు లేఖ రాయడానికి నిమ్మగడ్డ రమేశ్ ఎవరని..? మంత్రి ప్రశ్నించారు.

ప్రభుత్వాన్ని, ప్రజలను, గవర్నర్ ను లెక్కచేయని నిమ్మగడ్డ రమేశ్ను ఎన్నికల కమిషనర్ గా తాము గుర్తించడంలేదని వ్యాఖ్యానించారు.

2018 జూన్ నెలలో ఎన్నికలు నిర్వహించాల్సిన నిమ్మగడ్డ.... ఇప్పుడు నీతులు చెబుతున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వాల హయాంలో నాలుగు సంవత్సరాల పాటు ఎన్నికల నిర్వహించనప్పుడు నిమ్మగడ్డ రమేశ్ ఏం చేశారని...? నిలదీశారు.

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సీఎం భయపడుతున్నాడని అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం అవివేకమన్నారు.

ప్రజల ప్రాణ, రక్షణ దృష్ట్యా వేసవి కాలంలోనే ఎన్నికలు నిర్వహిస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపా 90శాతం పంచాయతీలు, మున్సిపాలిటీలు గెలవకుంటే తాను మంత్రి పదవికి రాజీనామా చేసి, రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ విసిరారు.

Tags :

Advertisement